For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  keerthy Suresh రెమ్యునరేషన్ లీక్.. స్టార్ హీరో చెల్లి పాత్ర కోసం కూడా భారీ డిమాండ్

  |

  నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్ రోజురోజుకు తన అభిమానుల సంఖ్యని అమితంగా పెంచుకుంటోంది. సీనియర్ హీరోయిన్ మేనక కూతురు అయినటువంటి కీర్తి సురేష్ చాలా కమర్షియల్ సినిమాలు చేసింది. అయితే ఆమెకు మంచి విజయంతో పాటు మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా మాత్రం మహానటి. ఆ సినిమాతోనే కీర్తి కెరీర్ ఒక్కసారి మలుపు తిరిగింది. సీనియర్ నటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా 2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాతో కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్స్ లలో ఒకరిగా క్రేజ్ అందుకుంటోంది. ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను లోకల్ కూడా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.

  పోర్న్ కేసు 'షెర్లిన్ చోప్రా'.. ఘాటు అందాలు..నెవర్ బిఫోర్!

  ఇక తమిళంలో పందెంకోడి 2, సర్కార్ వంటి సినిమాల్లో కూడా ఛాన్స్ అందుకొని మంచి రెమ్యునరేషన్ ను అందుకుంది.ఏడాదికి పదికి పైగా ఆఫర్లు వస్తున్నప్పటికీ కీర్తి సురేష్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే ఓకే చేస్తోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ఆఫర్ వచ్చినా సరే కథతో పాటు పాత్ర కూడా నచ్చితేనే సినిమా చేయడానికి ఓకే చెబుతోంది. 2019లో మూడు నాలుగు పెద్ద హీరోల సినిమాలను రిజెక్ట్ చేసినట్లు టాక్ అయితే గట్టిగానే వచ్చింది. కొందరు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ చెప్పినప్పటికీ కీర్తి సురేష్ మొహం మీద చేయనని చెప్పేసిందట. ఇక ఆమెకు కథ నచ్చితే మాత్రం రెమ్యునరేషన్ గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట.

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

  Keerthy suresh remuneration for megastar chiranjeevi upcoming movie

  ఎక్కువగా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకుంది. ఇటీవల ఒక స్టార్ హీరోకు సిస్టర్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా టాక్ అయితే వస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోదరిగానే కీర్తి నటించబోతున్నట్లు సమాచారం. తమిళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన వేదళం సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో త్వరలోనే టాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సిస్టర్ రోల్ ముఖ్యమైనది కావడంతో ముందుగా సాయిపల్లవి ఇలాంటి సెట్ చేసుకోవాలని అనుకున్నారు. ఆ తర్వాత ఆమె అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కీర్తిసురేష్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

  భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

  ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు కీర్తి సురేష్ కు దాదాపు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. 2020 లో వచ్చిన సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించింది. అనంతరం నితిన్ తో చేసిన రంగ్ దే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలున్నాయి. అందులో రజనీకాంత్ అన్నత్తై తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి హిట్టయినా కూడా కూడా కీర్తి సురేష్ స్థాయి మరో లెవెల్ కు వెళ్లినట్లే..!

  English summary
  In the Tollywood industry, everyone is talking about the first look of Mahesh Babu's new film. Sarkaru vaari paata along with their title, Mahesh Babu's new look has also increased the dose of anticipation in the film. If not, there are many rumors of ruminations on this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X