Maamannan Collections బాక్సాఫీస్‌పై సీఎం కుమారుడి జైత్రయాత్ర.. కీర్తి సురేష్ మూవీ కలెక్షన్ల వర్షం.. ఎన్ని కోట్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన మామన్నన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్, వడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రెడ్ గ్లాంట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గత 4 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
మామన్నన్ చిత్రంలో భారీగా తారాగణం ఉండటంతో బడ్జెట్ కూడా ఆ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను 25 కోట్ల వ్యయంతో చిత్రీకరించారు. తమిళనాడులో 600 స్క్రీన్స్‌కుపైగా, కేరళలో 200 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళ వెర్షన్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

మామన్నన్ చిత్రం తొలి రోజు తమిళనాడులో 8.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు తమిళనాడులో 5.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్లు వసూలు చేసింది. అలాగే మూడో రోజు కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. మూడో రోజు 8.6 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 11.2 కోట్ల గ్రాస్ వసూళ్లు వసూలు చేసింది.
మామన్నన్ చిత్రానికి సంబంధించి 4 వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోలకు 30 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్న్ం 60 శాతం ఆక్యుపెన్సీ, ఫస్ట షోకు 60 శాతం, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఉదయనిధి స్టాలిన్‌కు చివరి సినిమా కావడంతో కొంత అటెన్షన్‌ను సొంతం చేసుకొన్నది.

మామన్నన్ సినిమా 4 వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం తమిళనాడులో 10 కోట్ల వరకు కలెక్షన్లు సాధిస్తే.. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
మామన్నన్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి భారీ లక్ష్యమే ఉంది. కానీ ఇప్పటికే ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఇప్పటికే 40 కోట్లు వసూలు చేసింది కనుక తొలివారంలో ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











