twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌పై అక్షయ్ ఎటాక్.. 200 కోట్లవైపు ‘కేసరి’ పరుగు!

    |

    బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద చెలరేగుతున్నది. భావోద్వేగమైన చారిత్రాత్మక సంఘటనతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తున్నది. ఇటీవల రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం మరో మైలురాయిని అధిగమించింది. ఈ చిత్రం రూ.150 క్లబ్‌లో చేరి మరో రికార్డువైపు అడుగులేస్తున్నది. బాక్సాఫీస్ వద్ద కేసరి ఎంత వసూలు చేసిందంటే...

     200 కోట్ల క్లబ్‌ వైపు

    200 కోట్ల క్లబ్‌ వైపు

    కేసరి చిత్రంపై సినీ విమర్శకులు జైకొట్టడంతో తొలివారంలోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం అదే స్పీడ్‌తో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్ర వసూళ్లపై దర్శకుడు కరణ్ జోహర్ ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కేసరి చిత్రం నిలకడగా, భారీ కలెక్షన్లు సాధిస్తున్నది అని అన్నారు.

     అక్షయ్ వరుసగా మూడోసారి

    అక్షయ్ వరుసగా మూడోసారి

    అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం రూ.100 క్లబ్‌లో చేరితో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొంటారు. వరుసగా మూడుసార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ హీరోగా అక్షయ్ ఓ రికార్డును క్రియేట్ చేయనున్నారు. గతంలో ఆయన నటించిన గోల్డ్, 2.0 చిత్రాలు రూ.100 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    కేసరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్కేసరి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

     ఐపీఎల్, కొత్త సినిమాలకు ధీటుగా

    ఐపీఎల్, కొత్త సినిమాలకు ధీటుగా

    కేసరి చిత్రం తాజాగా విడుదలైన చిత్రాలను, ఐపీఎల్‌ను సైతం వెనుకకు నట్టేసింది. ఈ వారం రిలీజైన నోట్‌బుక్, జంగ్లీ లాంటి సినిమాల కంటే అధికంగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండోవారం కూడా దిగ్విజయంగా ముగించి మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ చిత్రం మరిన్నీ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

     ప్రపంచవ్యాప్తంగా 4 వేలకుపైగా థియేటర్లలో

    ప్రపంచవ్యాప్తంగా 4 వేలకుపైగా థియేటర్లలో

    అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజైంది. ఈ చిత్రం దేశంలో 3600 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 600 స్క్రీన్లలో విడుదలైంది. ఐపీఎల్ టోర్ని, కొత్త చిత్రాల నుంచి పోటీని తట్టుకొని కేసరి చిత్రం వసూళ్లను సాధించడం గమనార్హం.

    కేసరి కథ ఇదే

    కేసరి కథ ఇదే

    1890లో అఫ్ఘనిస్థాన్‌లో వేర్పాటువాదులకు, బ్రిటీష్ సేనలకు జరిగిన యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. 10 వేల మంది ఆఫ్ఘన్ వేర్పాటు వాదులను కేవలం 21 సిక్కు సైనికులు అడ్డుకొన్న తీరు, వారు చేసిన పోరాటలను అద్బుతంగా దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కించారు. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.

    English summary
    Anurag Singh's historical drama Kesari, featuring Akshay Kumar in the lead role, is on a roll at the box office, not only domestically but also on foreign shores. Kesari, which hit the Rs 100-crore milestone in its first week to become the fastest entrant in the Rs 100-crore club this year, has now grossed Rs 150 crore worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X