Kesari Chapter 2 Day 1 Collections: కేసరి 2 కి రికార్డు ఓపెనింగ్స్.. అక్షయ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ కలిసి నిర్మించిన సినిమా కేసరి చాప్టర్ 2. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ హీరోలుగా, అనన్య పాండే, రెజీనా కసండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు.

సైమన్ పైస్లీ డే, అలెక్స్ ఓనెల్, అమిత్ సియాల్, మసాబా గుప్తా, స్టివెన్ హార్ట్‌లీ తదితరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? జరిగిన బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Kesari 2 Box Office Collections

భారత స్వాతంత్ర ఉద్యమంలో జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ సాగించిన దమనకాండ నేపథ్యంగా అప్పటి అడ్వకేట్ జనరల్ శంకరన్ నాయర్ న్యాయపోరాటం బ్యాక్ డ్రాప్‌గా కేసరి చాప్టర్ 2 రూపొందింది. 1500 మందికిపైగా పొట్టన పెట్టుకొన్న మారణ కాండకు డయ్యర్ కారణం అంటూ శంకరన్ వేసిన కేసును ఆధారంగా చేసుకొని హై ఎమోషన్స్‌తో కూడిన కోర్టు డ్రామాగా తెరకెక్కింది.

కేసరి 2 సినిమాను పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందడం, ఈ సినిమా కోసం లావిష్ సెట్స్ వేయడం.. అప్పటి వాతవరణాన్ని ప్రతిబింబించడం కోసం వేసిన క్యాస్టూమ్స్, ఇతర నిర్మాణ అంశాలతో ఈ మూవీని రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్యపాండే, రెజీనా ఇతర నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిసి ఈ పిక్చర్ నిర్మాణ వ్యయం సుమారుగా 150 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కేసరి 2 సినిమా కోసం అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ దేశవ్యాప్తంగా భారీగా వినూత్నంగా ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమాపై అటెన్షన్ పెరిగేలా.. అంతేకాకుండా అంచనాలు పెంచేలా చేశారు. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తొలి రోజు సుమారుగా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది అని సాక్ నిల్క్ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురయ్యాయి. వాటితో పోల్చుకొంటే కేసరి 2 సినిమా బెటర్ ఓపెనింగ్స్ సాధించడానికి అవకాశం కనిపించింది. తాజా ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమా తొలి రోజు 10 కోట్ల నెట్, 15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా పాజిటివ్ టాక్ పెరిగితే.. ఇంకా కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 100 కోట్ల నెట్, 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి ఏ మేరకు లాభాలను పంచుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X