Kesari 2 Day 3 Collections: స్టడీగా కేసరి చాఫ్టర్ 2 కలెక్షన్లు.. అక్షయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్స్ హీరో అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కంసడ్రా తదితరులు నటించిన ఎమోషనల్ కోర్టు డ్రామా కేసరి చాప్టర్ 2. జలియానావాలా బాగ్ దుర్ఘటన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ కలిసి నిర్మించారు. ఏప్రిల్ 18వ తేదీన రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భారత స్వాతంత్ర ఉద్యమంలో జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ సాగించిన దమనకాండ నేపథ్యంగా అప్పటి అడ్వకేట్ జనరల్ శంకరన్ నాయర్ న్యాయపోరాటం బ్యాక్ డ్రాప్‌గా కేసరి చాప్టర్ 2 రూపొందింది. కేసరి 2 సినిమాను పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ మూవీలోని నటీనటుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిసి ఈ పిక్చర్ నిర్మాణ వ్యయం సుమారుగా 150 కోట్ల రూపాయలుగా అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కేసరి 2 సినిమాను ఆర్ మాధవన్, అక్షయ్ కుమార్ వినూత్నంగా ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రధాన నగరాల్లో తమదైన శైలిలో బజ్ క్రియేట్ చేశారు. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఇండియాలోనే ఈ మూవీని సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కేసరి సినిమా సుమారుగా 150 కోట్ల మేర బాక్సాఫీస్ కలెక్షన్ల టార్గెట్‌తో జర్నీ ప్రారంభించింది. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమా ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో ఈ మూవీ సుమారుగా 22 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ మార్కెట్‌లో కేసరి 2 సినిమా కలెక్షన్లు అంతగా వేగం పుంజుకోలేదనే విషయం స్పష్టమైంది. ఈ మూవీ గత రెండు రోజుల్లో 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ మూవీ రానున్న రోజుల్లో భారీగా ఆదరణను కూడగడితే.. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.
ఇక 3వ రోజు ఈ సినిమాకు ఆదివారం సెలవు దినం కలిసి వచ్చింది. ఈ మూవీకి ముంబై, బెంగళూరు, పూణే, చండీగఢ్, భోపాల్, లక్నో లాంటి నగరాల్లో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమా 3వ రోజు ఓ మోస్తారు బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ మూవీ కలెక్షన్లు కూడా భారీగానే ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేసరి చాప్టర్ 2 సినిమా 3వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ మూవీ ఇండియాలో 8 కోట్లకుపైగా కలెక్షన్లు, అలాగే వరల్డ్ వైడ్‌గా 9 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సాక్ నిల్క్, ఇతర ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 31 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











