Kesari 2 Day 4 Collections : 50 కోట్ల క్లబ్‌లోకి కేసరి.. ఈ కలెక్షన్స్‌తో కష్టమే, నాలుగో రోజు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి డ్రామా చాప్టర్ 2. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన జలియన్ వాలాబాగ్ ఘటన, ఆ తర్వాత జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా హీరూ యష్ జోహర్, అరుణా భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అమృత్‌పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ కలిసి నిర్మించారు. ఏప్రిల్ 18వ తేదీన రిలీజైన కేసరి చాప్టర్ 2 బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Kesari Chapter 2 బడ్జెట్ ఎంత ( Kesari Chapter 2 Budget)?

ఆర్ మాధవన్, అనన్య పాండే, రెజీనా కంసడ్రా తదితరులు కేసరి చాప్టర్ 2లో కీలకపాత్రలు పోషించారు. స్వాతంత్రోద్యమ కాలానికి తీసుకెళ్లడంతో పాటు హై టెక్నీకల్ వాల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాను నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిసి కేసరి చాప్టర్ 2కి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయిటనట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kesari Chapter 2 Day 4 Box Office Collections Worldwide Akshya Kumar movie entered into 50 crores club

Kesari Chapter 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Kesari Chapter 2 Break Even Target)?

టీజర్, ట్రైలర్లు, మాధవన్ , అక్షయ్ కుమార్‌ల ప్రచార కార్యక్రమాలతో కేసరి చాప్టర్ 2 చిత్రంపై భారీ బజ్ ఏర్పడింది. ఒక్క ఇండియాలోనే ఈ మూవీని సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారుగా 150 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టాలని విశ్లేషకులు విలువ కట్టారు.

గత మూడు రోజుల కలెక్షన్స్ (Kesari Chapter 2 3 Days Collections)

కేసరి చాప్టర్ 2కి విడుదల రోజే పాజిటివ్ టాక్, మంచి మౌత్ టాక్ దక్కడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. తొలి రోజు ఇండియాలో రూ.7.75 కోట్ల నెట్, రెండో రోజున రూ.9.75 కోట్ల నెట్, మూడో రోజున రూ.12 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. మొత్తంగా మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో నికరంగా రూ.30 కోట్లు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు ( Kesari Chapter 2 overseas collection)

ఓవర్సీస్‌లో బాలీవుడ్‌కు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ తొలి రెండ్రోజుల్లో కేసరీ చాప్టర్ 2 అంతగా పుంజుకోలేదు . మూడో రోజు నుంచి అక్షయ్ కుమార్ ఓవర్సీస్‌లో తన హవా చూపించడం మొదలుపెట్టాడు. నాలుగు రోజుల వరకు కేసరి చాప్టర్ 2 చిత్రానికి ఓవర్సీస్‌లో రూ. 14.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ మూవీ రానున్న రోజుల్లో భారీగా ఆదరణను దక్కించుకుంటే .. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.

నాలుగో రోజు వసూళ్లు ( Kesari Chapter 2 Day 4 Collection)

వీకెండ్‌లో జోరు చూపించిన అక్షయ్ కుమార్ చిత్రం.. సోమవారం వర్కింగ్ డే కావడంతో స్లో అయ్యింది. హిందీలో ఓవరాల్‌గా 14.39 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ముంబైలో 836 షోలు, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 1128 షోలు, పుణేలో 298 షోలు, బెంగళూరులో 270 షోలు, కోల్‌కతాలో 268 షోలు, అహ్మదాబాద్‌లో 534 షోలు, సూరత్‌లో 317 షోలు పడ్డాయి. నాలుగో రోజు కేసరి చాప్టర్ 2 చిత్రం రూ.4.59 కోట్ల నెట్ రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

మొత్తంగా నాలుగు రోజుల వరకు అక్షయ్ కుమార్ చిత్రం ఇండియాలో రూ.34.09 కోట్ల నెట్, రూ.35.25 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ 35.25 కోట్లు, ఓవర్సీస్‌లో వచ్చిన రూ.14.5 కోట్లతో కలిపి మొత్తంగా నాలుగు రోజుల వరకు అక్షయ్ కుమార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.49.75 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X