‘కేసరి’ మూవీ 2 డేస్ కలెక్షన్స్, 2019లో సరికొత్త రికార్డ్
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'కేసరి' బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ప్రారంభం అయింది. హోళీ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ. 21.50 కోట్లు వసూలు చేసింది. రెండో రోజైన శుక్రవారం సైతం వసూళ్లు స్ట్రాంగ్‌గా నమోదయ్యాయి.
చారిత్రక నేపథ్యం ఉన్న కథతో రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అటు ఆడియన్స్‌తో పాటు ఇటు క్రిటిక్స్ నుంచి కూడా మంచి స్పందన రావడంతో వసూళ్లు ఊపందుకున్నాయి.

హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్
‘కేసరి' చిత్రం తొలి రోజు రూ. 21.50 కోట్లు వసూలు చేయడం ద్వారా 2019లో హయ్యెస్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ‘గల్లీ బాయ్' ఓపెనింగ్ డే రికార్డులను ‘కేసరి' బీట్ చేసింది.

ఓపెనింగ్ డే బిజినెస్ 2019
- కేసరి : రూ. 21.50 కోట్లు
- గల్లీ బాయ్: రూ. 19.40 కోట్లు
- టోటల్ ధమాల్: రూ. 16.50 కోట్లు
- కెప్టెన్ మార్వెల్: రూ. 13.01 కోట్లు

సెకండ్ డే కలెక్షన్
సెలవు కావడంతో హోళీ రోజు ‘కేసరి' అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. అయితే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు కాస్త డ్రాప్ అయ్యాయి. ఇండియా వ్యాప్తంగా దాదాపు 3600 స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం దాదాపు రూ. 17 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అఫీషియల్ వివరాలు అందాల్సి ఉంది.

కేసరి
21 మంది సిక్కు సైనికులు.. 10 వేల మంది ఆప్ఘనిస్థాన్ ఆక్రమణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకరయుద్ధం నేపథ్యంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'కేసరి'. బ్రిటిష్ వారి హయాంలో ఇండియా, పాకిస్థాన్ కలిసి ఉన్నపుడు పాకిస్థాన్‌లోని సారాగర్హి అనే ప్రాంతంలో 1897 సెప్టెంబర్లో ఈ యుద్ధం జరిగింది. కేవలం 21 మందితో హవల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పికొట్టారు అనేది ఆసక్తికరంగా చూపించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిగా, ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో కరణ్ జోహార్‌తో కలిసి అరుణ్ భాటియా, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా, సునీర్ ఖేటర్ప సంయుక్తంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











