RRR అడ్వాన్స్ బుకింగ్స్ దాటేసిన KGF2.. లాంగ్ రన్ లో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ఎక్కడా తగ్గకుండా మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళుతోంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక రికార్డును ఇప్పుడు తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న కేజిఎఫ్ 2 సినిమా బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

RRR
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించిన తాజా చిత్రం RRR. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో అసలు చరిత్రలో కలవని అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక కల్పిత కథను అల్లుకున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 25 వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించింది వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది.

అడ్వాన్స్ బుకింగ్ లను
బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మరో సినిమా KGF. కోలార్ గోల్డ్ మైన్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. అప్పటివరకు కన్నడ సినీ పరిశ్రమ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని వారందరికీ ఈ సినిమా ద్వారా కన్నడ సినీ పరిశ్రమ సత్తా చాటి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ KGF2 విడుదలకు సిద్దమయింది. ఈ సినిమా RRR అడ్వాన్స్ బుకింగ్ లను క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

మల్టీప్లెక్స్‌లలో
గురువారం ఉదయం ప్రారంభమైన మల్టీప్లెక్స్‌లలో KGF 2 (హిందీ) అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే RRR (హిందీ) యొక్క పూర్తి అడ్వాన్స్ బుకింగ్స్ ని అతి తక్కువ సమయంలో దాటిందని అంటున్నారు. ముందుగా ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రధానంగా మల్టీప్లెక్స్‌లలో ఓపెన్ చేశారు. సింగిల్ స్క్రీన్‌లలో అడ్వాన్స్ బుకింగ్స్ వారాంతంలో లేదా సోమవారం ఓపెన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అత్యుత్తమ అడ్వాన్స్ బుకింగ్స్
కరోనా మహమ్మారి తర్వాత హిందీలో ఒక చిత్రానికి ఇది అత్యుత్తమ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా 2019లో విడుదలైన హృతిక్ రోషన్ వార్ తర్వాత ఈ సినిమా మంచి బుకింగులు సాధించింది. KGF2 శుక్రవారం బిజినెస్ ముగిసే సమయానికి మల్టీప్లెక్స్‌లలో RRR (హిందీ) మొత్తం అడ్వాన్స్ బుకింగ్ లను కవర్ చేస్తుందని అంటున్నారు.

అసాధారణ కలెక్షన్లు
ఇక ఈ సినిమా టిక్కెట్ రేట్లు కూడా RRR హిందీకి ఉన్నట్టే అధిక రేట్లు ఉన్నాయి. అయినప్పటికీ RRR (హిందీ) కోసం ఈ అధిక రేట్లు బాగా పనిచేశాయి. ఇప్పుడు KGF 2 కి కూడా ఈ రేట్లు బాగా పనికి వస్తాయని అంటున్నారు. RRR (హిందీ) లాగే ఈ సినిమాకు కూడా మొదటి రోజు అసాధారణ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











