KGF Chapter 2: బాహుబలి, RRR రికార్డులు బ్రేక్.. హాలీవుడ్ మూవీ కూడా వెనక్కే.. కేజీఎఫ్ సంచలనం
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి.. ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు జాతీయ అవార్డులు సైతం దక్కించుకున్న చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా భారీ స్పందనను దక్కించుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.
Recommended Video

దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలోనే బాహుబలి 2, RRR రికార్డులను సైతం బద్దలు కొట్టేసి.. దేశంలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది. ఆ వివరాలు మీకోసం!

కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్ వచ్చాడు
కేజీఎఫ్ చాప్టర్ 1 వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే‘KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.

అధీర ఎంట్రీతో మారిపోయిన కథ
కేజీఎఫ్‌ను రాఖీ భాయ్ సొంతం చేసుకోవడంతో చాప్టర్ 1 పూర్తైంది. ఇక, ఇప్పుడు అతడిని ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో ‘KGF Chapter 2' కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఇక, ఇందులో అధీరాగా సంజయ్ దత్ నటించారు. ఈ మూవీలో రాఖీ భాయ్ ఎలివేషన్ సీన్స్ మరింత హైలైట్‌గా తీశారు.

అంచనాలకు తగ్గట్లుగానే బిజినెస్
‘KGF Chapter 2' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అప్‌డేట్లకు భారీ స్పందన దక్కింది. ఇక, అన్ని భాషల్లో దీని హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ ధరకు అమ్ముడు పోయాయి. అలాగే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్‌ఫుల్స్‌తో
ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘KGF Chapter 2' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఏప్రిల్ 14న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.

అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 80 కోట్లు
విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకున్న ‘KGF Chapter 2' మూవీకి అనూహ్యంగా ఉత్తరాదిలోనూ భారీ స్పందన దక్కుతోంది. అందుకే అక్కడ టికెట్లు వేగంగా అమ్ముడుపోయాయి. ఇక, ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ‘KGF Chapter 2' మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే రూ. 80.30 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది.

బాహుబలి, RRR రికార్డులు బద్దలు
తెలుగులో తెరకెక్కినా దేశ వ్యాప్తంగా హవాను చూపించిన బాహుబలి మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. అలాగే, మన మరో చిత్రం RRR రూ. 58 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాలను దాటేసిన ‘KGF Chapter 2' రూ. 80.30 కోట్లతో ఇండియాలో నెంబర్ వన్ మూవీగా చరిత్ర సృష్టించింది.

వెనుకబడిన హాలీవుడ్, బాలీవుడ్
ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో KGF Chapter 2 (రూ. 80.30 కోట్లు), బాహుబలి (రూ. 80 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. హాలీవుడ్ మూవీ అవేంజర్స్ ఎండ్ గేమ్ (రూ. 60 కోట్లు) మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత RRR (రూ. 58 కోట్లు), సాహో (రూ. 36 కోట్లు), రోబో 2.0 (రూ. 35 కోట్లు), వార్ (రూ. 32.50 కోట్లు) మూవీలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











