KGF 2 : మొదటి రోజు కలెక్షన్ లతోనే రికార్డులు బద్దలు.. అన్ని కోట్లతో సరికొత్త రికార్డు!
కన్నడ సూపర్ స్టార్ యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంతటి సెన్సెషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ అటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్... హీరో యష్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుని ఇండియా మొత్తానికి పరిచయం అయ్యారు. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో వచ్చిన మొదటి భాగం దేశవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఈ సినిమా విడుదల సమయంలోనే సిక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో KGF 2 మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా విడుదల కూడా కాకముందే అనేక రికార్డులు బద్దలు కొడుతుంది. మొదటిరోజు హిందీ కలెక్షన్ల రికార్డులు భారీ ఎత్తున బద్దలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

యశ్ లీడ్ రోల్ లో
కన్నడ స్టార్ హీరో యశ్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం KGF చాప్టర్ 2. పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ వెంటనే వైరల్ అవుతోంది. KGF 2 నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు రెస్పాన్స్ ఏ రేంజ్లో వచ్చిందే తెలిసిందే.

అంచనాలు పెంచిన ట్రైలర్
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నా.. పలుమార్లు కరోనా కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 14న విడుదల అవుతోంది. తాజాగా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ చేయగా ఆ . విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఆ ట్రైలర్ లో యష్ నటనతో అదరగొట్టాడు..

మరో రిలీజ్
రక్తంతో రాసిన కథ ఇది.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేము అంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ సినిమా మీద అంచనాలు మరింత పెంచే విధంగా ఉన్నాయి. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధీరా పాత్రలో నటించాడు. రవీనాటాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ KGF చాఫ్టర్ 1ను మరోసారి నిర్దేశించిన థియేటర్లలో రిరిలీజ్ చేసి రెండో భాగం మీద అంచనాలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

40 కోట్ల అంచనాతో
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజా సమాచారం మేరకు KGF చాప్టర్2 హిందీ బెల్ట్‌లో 4000+ స్క్రీన్‌లలో విడుదల కానుంది. ఇక డే-1 వసూళ్లు ₹ 40 కోట్ల నెట్ వసూళ్ల మార్కును తాకవచ్చు లేదా దాటవచ్చని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు
ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే 14 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ద్వారా సంపాదించిన ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. RRR మొదటి రోజు కూడా అంతా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











