RRR టోటల్ హిందీ కలెక్షన్స్ ఎంత రావచ్చంటే.. KGF 2 మాత్రం అంతకుమించి!
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. దర్శకుడు రాజమౌళి మరోసారి తన అసలైన పంజా విసిరి బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు. అయితే హిందీలో బాహుబలి రేంజ్ లో హిట్ కాకపోయినప్పటికీ కూడా RRR సినిమా పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ అయితే అందుకుంటోంది. ఇక హిందీ లో సినిమా టోటల్ గా ఎంత రాబట్టవచ్చు అలాగే ఇప్పటి వరకు ఎంత వచ్చాయి? ఇక ఈ సినిమా అనంతరం రాబోతున్న KGF ఎఫ్ చాప్టర్ టు ఏ స్థాయిలో రికార్డును బ్రేక్ చేస్తుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినటువంటి RRR సినిమా లో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు బాక్సాపీస్ వద్ద భారీ స్థాయిలో మొదటి వారం తర్వాత కూడా అదే తరహాలో ముందుకు సాగుతుండడం విశేషం.

హిందీ బిజినెస్
ఇక హిందీలో కూడా బాహుబలి రేంజ్ లోనే విడుదలయిన RRR సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. అక్కడ మెల్లగా కలెక్షన్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది సోమవారం హిందీలో ఏడు కోట్ల నెట్ కలెక్షన్ సర్దుకుంది. ఒక హిందీ సినిమా బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమా హిందీలో 92 ప్రీ కోట్ల రిలీజ్ బిజినెస్ తో విడుదల చేయడం జరిగింది.

టోటల్ గా ఎంత రావచ్చు
ఇక విడుదల చేసిన మొదటి సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది.. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 190 రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం దాదాపు పెట్టిన పెట్టుబడి అయితే హిందీలో వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మంచి ఆదాయంతో కొనసాగుతున్నారు. టోటల్గా ఈ సినిమా హిందీలో 250 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.

RRR కంటే ఎక్కువగా..
ఇక ప్రస్తుతం అయితే అందరూ ఫోకస్ కేజిఎఫ్ చాప్టర్2 పైనే ఉంది. ఈ సినిమా కూడా హిందీలో భారీ స్థాయిలో బిజినెస్ చేయగా RRR రేంజ్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. హిందీలో ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది ఇక ఈ సినిమా సినిమా లో రికార్డు రాజమౌ బ్రేక్ చేసే విధంగా దాదాపు 300 కోట్ల హిందీ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

300కోట్లు రవచ్చట
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి కేజిఎఫ్ చాప్టర్ 2 కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పరుచుకుంది. సినిమా రిలీజ్ బిజినెస్ తోనే నిర్మాతలు చాలా వరకు సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ఇక విడుదల తర్వాత మొదటి రోజు ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ బచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమా ఫుల్ రన్లో 300 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవచ్చు అని సమాచారం.


Click it and Unblock the Notifications











