KGF 2 : తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ బిజినెస్.. పవన్ భీమ్లా నాయక్ కంటే ఎక్కువ.. ఎన్ని కోట్లంటే?
మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన KGF చాప్టర్ 2 కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అయితే స్వతహాగా దాదాపుగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఇతర తెలుగు సినిమాలకు, RRR లాంటి పాన్ ఇండియా సినిమాలకు సైతం షాక్ ఇస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో RRRను దాటిన ఈ సినిమా ఇప్పుడు పవర్ స్టార్ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ ను కూడా దాటేసింది. ఆ వివరాలు

ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్
KGF సినిమా విడుదల అయిన నాటి నుంచి ఈ సీక్వెల్ సినిమా మీద అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యాయి. ఈ దెబ్బకు సినిమా మార్కెట్ వాల్యూ కూడా ఒక్కసారిగా మారిపోయింది. సినిమా అనుకున్న సమయంలో రకరకాల డీల్స్ వచ్చినా చాలా వరకు నిర్మాత టెంప్ట్ అవ్వకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 400కోట్లకు పైగానే అమ్ముడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పవన్ కెరీర్ లో
తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం భీమ్లా నాయక్ ను దాటేసింది అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల నాటికి ఏపీలో టికెట్ రేట్ల సంక్షోభం నడుస్తోంది. ఈ సినిమా విడుదల అయ్యి ఫుల్ రన్ పూర్తి అయింది అని నిర్ధారించుకున్న తరువాతే ఏపీ ప్రభుత్వం కొత్త రేట్లు ప్రకటించింది. ఈ క్రమంలో పవన్ కెరీర్ లో మంచి భారీ బడ్జెట్ చిత్రమే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ కొంచెం ఇబ్బందికరంగానే జరిగింది.

88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగ్గట్టు 'భీమ్లా నాయక్'కు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 35 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.40 కోట్లు, గుంటూరులో రూ. 7.20 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.25 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

112.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
కానీ ఇప్పుడు ఆ సినిమాకు మించి KGF చాప్టర్ 2 బిజినెస్ జరుగిందనై అంటున్నారు. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న KGF చాప్టర్ 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. నైజాంలో రూ. 50 కోట్లు, సీడెడ్‌లో రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7 కోట్లు, గుంటూరులో రూ. 8 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3.5 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 112.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు.

ఏప్రిల్ 14న
మొత్తం మీద ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేజిఎఫ్ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా వసూళ్లు బద్దలు కావడం పెద్ద విషయంగా అయితే కనిపించడం లేదు. ఈ సినిమాలోయష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గ నటించింది. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. కేజీఎఫ్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











