బాక్సాఫీస్ వద్ద ‘కెజిఎఫ్’ కలెక్షన్ల ప్రభంజనం... రూ. 100 కోట్ల దిశగా!
యష్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'కెజిఎఫ్' తెలుగు, తమిళం, హిందీలో కూడా విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. తొలి 4 రోజుల్లో రూ. 80 కోట్ల మార్కును అందుకున్న ఈ చిత్రం త్వరలోనే రూ. 100 కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
యష్ కన్నడ హీరో కావడం, ఇతర ఇండస్ట్రీ వారికి పెద్దగా పరిచయం లేని నటుడు కావడంతో.... ఓపెనింగ్స్ కన్నడలో తప్ప ఇతర భాషల్లో పెద్దగా రాలేదు. అయితే సినిమా విడుదలైన తర్వాత పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి.

బాలీవుడ్లో స్లోగా మొదలై...
హిందీలో ‘కెజిఎఫ్' మూవీ నెమ్మదిగా మొదలైంది. అయితే షారుక్ ఖాన్ నటించిన ‘జీరో' చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో ‘కెజిఎఫ్' వసూళ్లు పుంజుకున్నాయి. ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో రూ. 9.20 కోట్లు వసూలు చేసింది. కన్నడ డబ్బింగ్ చిత్రానికి హిందీ బాక్సాఫీసు వద్ద ఫస్ట్ వీకెండ్ ఇంత భారీ మొత్తం రావడం గొప్ప విషయమే.

సోమవారం కూడా అదరగొట్టింది
‘కెజిఎఫ్' హిందీ వెర్షన్ సోమవారం రూ. 2.90 కోట్ల రాబట్టింది. దీంతో 4 రోజుల వసూళ్లు రూ. 12.10 కోట్లకు రీచ్ అయింది. సోమవారం వసూలైన కలెక్షన్స్ ఓపెనింగ్ డే కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సినిమాకు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం వల్లే వసూళ్లు పెరిగాయి.

క్రిస్మస్ హాలిడే కలిసొస్తుందా?
కెజిఎఫ్ హిందీ వెర్షన్ ఓపెనింగ్ డే శుక్రవారం రూ. 2.10 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో శనివారం రూ. 3 కోట్లు, ఆదివారం రూ. 4.10 కోట్లు రాబట్టింది. సోమవారం వీక్ డే అయినప్పటికీ రూ. 2.90 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ రోజు క్రిస్మస్ హాలిడే కావడంతో వసూళ్లు మరింత పెరిగడం ఖాయం అంటున్నారు.

కర్నాటకలో రికార్డ్ బ్రేకింగ్
ఇక కర్నాటకలో ‘కెజిఎఫ్' మూవీ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధిస్తోంది. అయితే తమిళం, తెలుగు, మలయాళంలో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరుగడం లేదు. అయితే గ్రోత్ మాత్రం డీసెంటుగా ఉంది అని అంటున్నారు.

టోటల్ రూ. 80 కోట్లు
సోమవారం సౌత్ స్టేట్స్‌లో నమోదైన వసూళ్లు పరిశీలిస్తే... కర్నాటకలో రూ. 11.70 కోట్లు, తెలుు రాష్ట్రాల్లో రూ. 1.90 కోట్లు, తమిళనాడులో రూ. 90 లక్షలు, కేరళలో రూ. 40 లక్షలు వసూలైంది. సోమవారం నాటికి వరల్డ్ వైడ్ రూ. 80 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











