ఓ వైపు భారీ హైప్: ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి?
యష్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'కెజిఎఫ్' కన్నడ, తెలుగు, హిందీ, తమిళం భాషల్లో విడుదలై బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది. ఈ మూవీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. తొలి రోజు రూ. 18 కోట్లు వసూలు చేయగా కేవలం కన్నడలోనే రూ. 12.50 కోట్లు రాబట్టింది.
కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి బిగ్గెస్ట్ రిలీజ్ 'కెజిఎఫ్'. ఒక కన్నడ చిత్రం హిందీలో 1500 స్క్రీన్లలో విడుదల కావడం ఇదే తొలిసారి. కన్నడలో 400 స్క్రీన్లు, తెలుగులో 400 స్క్రీన్లు, తమిళంలో 100, మలయాళం 60... ఇలా మొత్తం 2460 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

హిందీ వెర్షన్ వసూళ్లు
అయితే హిందీ ప్రేక్షకులకు పరిచయం లేని హీరో కావడంతో తొలి రోజు రూ. 2.10 కోట్లకు మించి వసూలు కాలేదు. అయితే సినిమాకు క్రమక్రమంగా మౌత్ టాక్ పెరుగుతోందని, దీంతో రెండో రోజు రూ. 3 కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్ సమయానికి వసూళ్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

రెండో రోజు పుంజుకున్న వసూళ్లు
అయితే తొలి రోజుతో పోలిస్తే ఓవరాల్ వసూళ్లు పుంజుచుకున్నాయి. శనివారం ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలిపి రూ. 19.20 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల టోటల్ రూ. 37.21 కోట్లకు చేరుకుంది. ఆదివారం రూ. 50 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉంది.

తెలుగు, తమిళంలో డీసెండ్ రన్
తెలుగు, తమిళంలో ఈ చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ డే వసూళ్లు నార్మల్‌గా ఉన్నప్పటికీ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో వసూళ్లు పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కెజిఎఫ్
యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన కెజిఎఫ్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్వకత్వం వహించారు. కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంతో 70, 80 నాటి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించగా ‘కెజిఎఫ్' చాప్టర్ 1 పేరుతో మొదటి భాగం విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











