twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యష్ ఒకే దెబ్బతో కుంభస్థలం కొట్టేశాడు.. ప్రస్తుతం ఆయన ఆస్తి ఎంతంటే!

    |

    కేజీఎఫ్ సినిమాకు ముందు యష్ అంటే దక్షిణాదిలో పెద్దగా తెలిసినా వారుండరనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన తర్వాత హీరో యష్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా మారుమోగిపోయింది. బాలీవుడ్‌లో కేజీఎఫ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా కన్నడ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా చరిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ చిత్రంలో నటించిన నటీనటుల ఆస్తుల విలువ ఎంత అనే లిస్టును కన్నడ మీడియా అంచనా వేసింది. అయితే యస్ ఆస్తి మాత్రం కళ్లు చెదిరేలా ఉండటం గమనార్హం. ఇంతకు యష్ నెట్ ఆస్తి ఎంతంటే..

     2008లో ఇండస్ట్రీలోకి

    2008లో ఇండస్ట్రీలోకి

    యష్ కెరీర్ విషయానికి వస్తే.. 2008లో టెలివిజన్ సీరియల్‌‌లో నటించడం ద్వారా కన్నడ సినీరంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత చిన్నా చితక అవకాశాలను చేజిక్కించుకొంటూ కెరీర్‌ను పెంచుకొనే ప్రయత్నం చేశారు. అయితే కేజీఎఫ్‌తో అదృష్టం ఆయన ఇంటి తలుపుతట్టింది. రాకీగా యష్ చూపించిన నటన నభూతో నభవిష్యత్‌గా మారింది.

    కేజీఎఫ్‌తో ఆర్థికంగా

    కేజీఎఫ్‌తో ఆర్థికంగా

    కేజీఎఫ్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం సుమారు రూ.80 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. అయితే ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ.250 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. కేజీఎఫ్ తర్వాత యష్ పేరు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. కమర్షియల్‌గా పలు అవకాశాలు ముందు వచ్చి పడ్డాయి. దాంతో ఆర్థికంగా కూడా యష్ సెటిలయ్యాడని కన్నడ వర్గాల టాక్.

     యష్ ఆస్తి విలువ ఇలా పెరిగి

    యష్ ఆస్తి విలువ ఇలా పెరిగి

    తాజాగా కన్నడ మీడియా అంచనా వేసిన ప్రకారం.. యష్ నికర ఆస్తుల విలువ రూ.40. ఒకే ఒక సినిమాతో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేశాడనే మాట వినిపించింది. కేజీఎఫ్ కంటే ముందు యష్‌కు పెద్దగా ఆస్తులు లేవని అందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమా ఆయన జీవితాన్ని మలుపుతప్పింది. ఆర్థికంగానే కాకుండా పాపులారిటీ పరంగా స్టార్ హోదాను తెచ్చిపెట్టింది.

     ఇతర నటీనటులు ఆస్తులు

    ఇతర నటీనటులు ఆస్తులు

    ఇక కేజీఎఫ్ చిత్రంలో నటించిన నటీనటులు అనంత్ నాగ్, శ్రీనిధి శెట్టి, అచ్యుత కుమార్ లాంటి నటులు ఆస్తుల విలువను కూడా అంచనా వేశారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అనంత్ నాగ్ ఆస్తుల విలువ రూ.22 కోట్లు అని తేల్చారు. ఇక శ్రీనిధి, అచ్యుత్ ఆస్తులను రూ.7 కోట్లుగా అంచనా వేశారు.

     ప్రశాంత్ నీల్ గురించి

    ప్రశాంత్ నీల్ గురించి

    ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడనే కాకుండా తెలుగు పరిశ్రమలోని స్టార్ హీరోలందరూ ఇప్పుడు ప్రశాంత్ వైపు చూస్తున్నారు. మహేష్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లతో సంప్రదింపులు జరిగాయి. కానీ త్వరలోనే ఎన్టీఆర్‌తో ఓ సినిమా అనౌన్స్ కానున్నది.

    Recommended Video

    KGF Star Yash’s Next Movie Update | Filmibeat Telugu
    త్వరలోనే కేజీఎఫ్2

    త్వరలోనే కేజీఎఫ్2

    ఇక కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్నది. బాలీవుడ్, టాలీవుడ్ నటుల కలయికలో ఇది ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్నది. ఈ చిత్ర షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అలాగే సినిమా రిలీజ్ కూడా వాయిదా వేసినట్టు వార్తలు వచ్చాయి.

    English summary
    KGF Chapter 1 star Yash net Assets value now hot topic in entertainment industry. Yash net assets assessed as Rs.40 crores. After KGF chapter 1 huge success, KGF2 is coming with grand. This movie is set to release on October 23.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X