KGF 17 Days Collections: మళ్ళీ పుంజుకున్న కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కు కూతవేటు దూరంలో?
బాహుబలి దెబ్బకు సౌత్ ఇండియా సినిమాలకు మార్కెట్ పెరిగింది. ఈ క్రమంలోనే బాహుబలి 2, పుష్ప, వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. అలా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న 'KGF Chapter 1' కూడా నార్త్ లో సత్తా చాటింది. కన్నడ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'KGF Chapter 2'ను సిద్దం చేశారు. భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక 'KGF Chapter 2' 17 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

ఏకకాలంలో
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం KGF Chapter 2. హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, అచ్యుత్, ప్రకాష్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించగా సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు.

క్రేజ్ తో
KGF Chapter 1 క్రేజ్ తో 'KGF Chapter 2' మూవీకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, మిగతా ఇండియా కలిపి ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా తెలిపింది.

17వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ రిపోర్ట్
ఏపీ, తెలంగాణలో 'కేజీఎఫ్ 2' మూవీ 17వ రోజూ సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 17వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 లక్షల షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్
'కేజీఎఫ్ 2'కు 17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.19 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.35 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.34 కోట్లు, గుంటూరులో రూ. 4.40 కోట్లు, కృష్ణాలో రూ. 3.95 కోట్లు, నెల్లూరులో రూ. 2.62 కోట్లతో.. కలుపుకుని రూ. 78.30 కోట్లు షేర్, రూ. 126.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ప్రాంతాల కలెక్షన్స్ రిపోర్ట్
ఏపీ, తెలంగాణలో 17 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 78.30 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 90 కోట్లు, తమిళనాడులో రూ. 41 కోట్లు, కేరళలో రూ. 25.00 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 182.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 83.10 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 17 రోజుల్లోనే రూ. 500.05 కోట్లు వసూలు చేసింది.

ఎన్ని కోట్లు లాభమంటే
'కేజీఎఫ్ 2' మూవీ అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 79 కోట్లుగా నమోదైంది. ఇక, ఇది 17 రోజుల్లోనే రూ. 78.30 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 70 లక్షలు కోట్లు వస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసి 153.05 కోట్ల లాభాలతో దూసుకుపోతుంది.


Click it and Unblock the Notifications











