KGF Chapter 2 day 1 collections బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ శివతాండవం.. RRR రికార్డులు బ్రేక్!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chapter 2 చిత్రం విడుదలైన ప్రతీ చోట అనూహ్యమైన రెస్పాన్స్‌ను కూడగట్టుకొంటున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ అక్యుపెన్సీ ఉండటంతో భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం తొలి రోజు వసూళ్ల అంచనా ఎంతంటే?

ప్రీమియర్లతో హల్‌చల్
KGF Chapter బుధవారం అర్ధరాత్రి నుంచి బెంగళూరు, అమెరికా, యూకే, ఓవర్సీస్‌లోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్లు మొదలయ్యాయి. తొలి ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ.. సోషల్ మీడియా మాథ్యమాల్లో ట్వీట్లు, పోస్టులతో హోరెత్తించారు. దాంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

కేజీఎఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా.
KGF Chapter 2 సినిమా కమర్షియల్ అంశాల విషయానికి వస్తే.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటకలో 100 కోట్ల మేర బిజినెస్, తెలుగులో 78 కోట్లు, తమిళంలో 27 కోట్లు, కేరళలో 10 కోట్లు మేర బిజినెస్ నమోదైంది. ఇక హిందీ వెర్షన్, ఇతర రాష్ట్రాల్లో కలిపి 100 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ విషయానికి వస్తే.. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా సుమారు 345 కోట్ల వద్ద బిజినెస్ క్లోజైంది. దాంతో కేజీఎఫ్ చాఫ్టర్ 2 చిత్రం 350 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల అంచనా
KGF Chapter 2 సినిమాకు ఊహించని విధంగా అడ్వాన్సు బుకింగ్ కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు నమోదుయ్యాయి. తొలి రోజు ముగిసిన తర్వాత ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

హిందీ వెర్షన్‌కు బ్రహ్మరథం
KGF Chapter 2 హిందీ వెర్షన్‌కు భారీగా స్పందన వ్యక్తమైంది. రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులతో హంగామా చేసింది. ఈ సినిమా తొలి రోజున 50 నుంచి 55 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక కన్నడ రాష్ట్రంలో ఈ సినిమా రూ. 30 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రిజిస్టర్ చేసే అవకాశం ఉంది.

తమిళనాడు, మలయాళం, ఓవర్సీస్‌లో
KGF Chapter 2 మూవీకి తమిళనాడు, కేరళ, ఓవర్సీస్‌లో భారీగా రెస్సాన్స్ లభిస్తున్నది. తమిళనాడులో 7 కోట్లు, మలయాళంలో 6 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ఆస్కారం ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే ఓవర్సీస్‌లో తొలి రోజు ప్రీమియర్లతో కలిపి 3.5 మిలియన్ డాలర్ల నుంచి 4 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.
Recommended Video


తొలి రోజు ఎంత వసూలు అంటే..
KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నందున రికార్డు వసూళ్లు నమోదు చేయడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమా తొలి రోజు 155 నుంచి 160 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఫస్ట్, సెకండ్ షోలకు రెస్పాన్స్ పెరిగితే.. ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











