KGF Chapter 2 US collections: అమెరికాలో యష్ ప్రభంజనం.. తొలి రోజే రికార్డుల పరంపర
KGF Chapter 2 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్‌లో రికార్డులను తిరగరాస్తున్నది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసేందుకు పరుగులు పెడుతున్నది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ అనే భాషా బేధం లేకుండా ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజైన ప్రతీ చోట ప్రభంజనం సృష్టిస్తూ సరికొత్త రికార్డులను సొంతం చేసుకొనేందుకు పరుగులు పెడుతున్నది. అయితే అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యష్, ప్రశాంత్ నీల్‌కు నీరాజనం
KGF Chapter 2 చిత్రం మాస్ ఎంటర్‌టైనర్‌గా రికార్డులకు ఎక్కింది. తొలి ఆట నుంచి ఎవరూ ఊహించని రెస్సాన్స్‌ను ఈ చిత్రం సాధించింది. బీజీఎం ఎలివేషన్స్, స్టంట్స్, విజ్వల్ ఫీస్ట్‌గా అన్ని విభాగాల్లోనే ప్రేక్షకుడిని సంతృప్తికి గురిచేసింది. దాంతో ప్రతీ భాషలోను యష్ పెర్ఫార్మెన్స్‌కు, ప్రశాంత్ నీల్ ప్రతిభకు ప్రేక్షకులకు నిరాజనం పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో
KGF Chapter 2 సినిమా విషయానికి వస్తే.. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఎస్, యూకేలో భారీగా రిలీజైంది. అన్ని భాషలకు సంబంధించిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో బ్రహ్మండమైన ఓపెనింగ్స్ లభించాయి. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను చూస్తే ఈ సినిమా ఓవర్సీస్‌లోనే 100 కోట్ల మార్కును దాటే అవకాశం కనిపిస్తున్నది.

11000 థియేటర్లలో
KGF Chapter 2 చిత్రం ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో 4000 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఒక హిందీలోనే 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 11000 స్క్రీన్లలో విడుదల చేయడం కన్నడ సినిమాకు సంబంధించి ఓ రికార్డుగా మారింది.

అమెరికాలో మంచి డిమాండ్
KGF Chapter 1 చిత్రం ఎలాంటి అంచనాల లేకుండా థియేటర్లోకి వచ్చి భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను అప్పట్లో ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో KGF Chapter 2 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక KGF Chapter 2 మూవీకి అమెరికాలో మంచి డిమాండ్ ఏర్పడటంతో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు.
Recommended Video


మిలియన్ డాలర్ క్లబ్‌లో కేజీఎఫ్2
అమెరికాలో KGF Chapter 2 చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. ఈ సినిమాను అమెరికాలోని 450 లొకేషన్లలో విడుదల చేశారు. దాంతో భారీగా కలెక్షన్లు తొలి రోజు నమోదయ్యాయి. అమెరికాలో తొలి రోజే అఖండమైన రికార్డును సాధించింది. అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.


Click it and Unblock the Notifications











