KGF2 day 1 WW collections బాక్సాఫీస్ మాన్‌స్టర్‌గా యష్.. కుంభస్థలాన్ని కొట్టిన ప్రశాంత్ నీల్
KGF Chapter 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. KGF Chapter 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

పవర్‌ఫుల్ ఎలివేసన్, బిల్డప్స్‌తో
కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ మరోసారి ప్రేక్షకుల మనసులను దోచుకొన్నది. కేజీఎఫ్1 తో అంచనాలు పెంచిన ఈ చిత్రం రెండింతల ఫీల్‌ను అందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రతీ సన్నివేశం పవర్‌ఫుల్ నేరేషన్‌తో, బిల్డప్ షాట్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఈ సినిమాకు సానుకూలంగా మారింది. దాంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు పోటెత్తారు.

బాలీవుడ్‌లో రికార్డు ఓపెనింగ్స్
దేశవ్యాప్తంగా ప్రాంతం, భాష అనే తేడా లేకుండా KGF Chapter 2 కోసం ప్రేక్షకులు ఎగబడటంతో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. బాలీవుడ్ చరిత్రను తిరగరాస్తూ.. హిందీ సినిమా పరిశ్రమలో అత్యధిక ఒపెనింగ్స్ సాధించిన చిత్రంగా KGF Chapter 2 రికార్డు క్రియేట్ చేసింది. టాప్ హీరోలు సాధించిన తొలి రోజు కలెక్షన్లను తుంగలో తొక్కేసింది.

నైజాం, ఆంధ్రాలో కలెక్షన్లు
KGF Chapter 2 సినిమా నైజాం, ఆంధ్రాలో భారీ వసూళ్లు సాధించింది. నైజాంలో 9.68 కోట్లు, సీడెడ్‌లో 2.84 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.70 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.19 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 84 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.13 కోట్లు, కృష్ణా జిల్లాలో 90 లక్షలు, నెల్లూరు జిల్లాలో 81 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల షేర్, 31 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

హిందీ వెర్షన్ తొలి రోజు వసూళ్లు
ఇక ఉత్తరాదిలో KGF Chapter 2 సినిమా బాక్సాఫీస్ జైత్రయాత్ర ఘనంగా కొనసాగింది. గతంలో హృతిక్, టైగర్ ష్రాప్ నటించిన వార్ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేసింది. వార్ సినిమా తొలి రోజు 53.35 కోట్లు రాబడితే.. కేజీఎఫ్2 చిత్రం 53.95 కోట్లతో హిందీ వెర్షన్పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 64.8 కోట్లు రాబట్టింది.

తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..
ఇక కర్ణాటక రాష్ట్రంలో KGF Chapter 2 చిత్రం 23.20 కోట్లు, తమిళనాడులో 8.20 కోట్లు, కేరళలో 7.10 కోట్లు, ఓవర్సీస్‌లో 23.90 కోట్లు వసూలు చేసింది. దాతో ఈ సినిమా దేశవ్యాప్తంగా 134.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 165 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఈ సినిమాను బాక్సాఫీస్ మాన్‌స్టర్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లపై బీస్ట్ సినిమా కొంత ప్రభావం చూపిందనే మాటను ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











