KGF2 day 2 Telugu States collections.. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువగా.. రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే?
KGF Chapter 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల హవా కొనసాగుతున్నది. ఈ చిత్రానికి అద్భుత స్పందన వ్యక్తమవుతున్నది. కేజీఎఫ్2 చిత్రం తొలి రోజున 19.09 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు స్వల్పంగా వసూళ్లు క్షీణించాయి. అయినా ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. రెండో రోజున ఈ చిత్రం 13.37 కోట్ల షేర్ నమోదు చేసింది. రెండో రోజు ప్రాంతాల వారీగా ఎంత వసూలు చేసిందంటే...
KGF Chapter 2 చిత్రం తొలి రోజున నైజాంలో రెండో రోజున 16.87 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 4.79 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.91 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.96 కోట్లు, పశ్చిమ గోదావరి 1.34 కోట్లు, గుంటూరు జిల్లాలో 1.84 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.58 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.17 కోట్లు వసూలు చేసింది. దాతో 32.46 కోట్లు షేర్, 52 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

KGF Chapter 2 చిత్రం నైజాంలో రెండో రోజున 7.19 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 1.95 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.21 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 77 లక్షలు, పశ్చిమ గోదావరి 50 లక్షలు, గుంటూరు జిల్లాలో 71 లక్షలు, కృష్ణా జిల్లాలో 68 లక్షలు, నెల్లూరు జిల్లాలో 36 లక్షలు వసూలు చేసింది. దాంతో 13.37 కోట్లు షేర్, 21 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఇక ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపి మత్తం 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 79 కోట్లతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు 56 కోట్ల షేర్ సాధించింది. ఇంకా ఈ చిత్రం 22 కోట్లు సాధిస్తే లాభాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











