KGF Chapter 2 day 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మహా జాతర.. రెండో రోజు ఎంతంటే?
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న KGF Chapter 2 చిత్రం రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటూ ఈ చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. తొలి రోజు నేషనల్ వైడ్‌గా 134.5 కోట్ల గ్రాస్‌ను, ప్రపంచవ్యాప్తంగా 165 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే KGFChapter2 చిత్రం రెండో రోజు సాగించిన జైత్రయాత్ర ఎలా ఉందంటే..

2వ రోజున ఉత్తరాది రాష్ట్రాల్లో
ఉత్తరాది రాష్ట్రాల్లో KGFChapter2 చిత్రం ప్రభంజనం కొనసాగుతున్నది. రెండో రోజు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజు 53.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజున కూడా అదే ఊపును బాక్సాఫీస్ వద్ద ప్రదర్శించింది. అడ్వాన్సు బుకింగ్ 25 కోట్లకుపైగా నమోదు కాగా.. కరెంట్ బుకింగ్‌తో కలిపి సెకండ్ షో వరకు దాదాపు 35 కోట్ల నుంచి 40 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్ సిటీలో
ఇక హైదరాబాద్ సిటీలో కూడా KGFChapter2 చిత్రం కలెక్షన్ల హవా కొనసాగుతున్నది. ఈ సినిమా రెండో రోజు 4.66 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. గతంలో RRR చిత్రం రెండో రోజు 9.90 కోట్లు, పుష్ప చిత్రం 4.6 కోట్లు, భీమ్లా నాయక్ చిత్రం 4.29 కోట్లు, రాధేశ్యామ్ చిత్రం 4.05 కోట్లు నమోదు చేశాయి.

ఇతర భాషల్లో, రాష్ట్రాల్లో
KGFChapter2 మూవీ ఇతర భాషల్లో కూడా ఇదే జోరును కొనసాగించింది. కన్నడలో 6.91 కోట్లు, తమిళంలో 3.4 కోట్లు, మలయాళంలో 1.51 కోట్లు మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. చెన్నై, చెంగల్పట్టు లాంటి ప్రాంతాల్లో KGFChapter2 ప్రభావం భారీగానే ఉంది. 321 షోల ద్వారా 1.3 మేర కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రం మరో 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో జైత్రయాత్ర
ఇక తెలుగు రాష్ట్రాల్లో KGFChapter2 సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఈ చిత్రం రెండో రోజున 50 కోట్ల మార్కును దాటి 100 కోట్లవైపు గురిపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

ఓవర్సీస్‌లో యష్ మాన్‌స్టర్‌గా
KGF Chapter 2 చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ముఖ్యంగా అమెరికా, సింగపూర్, యూకే, శ్రీలంక, దుబాయ్‌లో ఈ చిత్రం ధాటిగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున మరో 15 కోట్ల మేర కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 వసూళ్లను ట్రేడ్ వర్గాలు భారీగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తక్కువలో తక్కువ 115 నుంచి 120 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఈ చిత్రం రెండో రోజు సుమారు 280 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చు. ఇదే ఊపు కొనసాగితే వారాంతంలోగా ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం లేకపోలేదు అని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











