KGF Chapter 2 day 2 US collections.. ఓవర్సీస్‌లో బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ విధ్వంసం!

ప్రపంచ బాక్సాఫీస్‌‌పై రాకీభాయ్ దాడి భారీగానే కొనసాగుతున్నది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సానుకూలమైన స్పందన రావడంతో KGF Chapter 2 సినిమా కలెక్షన్ల వర్షం దండిగా కురుస్తున్నది. అడ్వాన్సు బుకింగ్, కరెంట్ బుకింగ్‌కు సినీ అభిమానులు పోటేత్తడంతో వసూళ్ల పర్వంగా రెండో రోజు కూడా కొనసాగింది. తొలి రోజున 15 కోట్ల గ్రాస్‌ను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కేజీఎఫ్ 2 మూవీ రెండో రోజు ఎంత వసూలు చేసిందంటే..

పలు దేశాల్లో భారీగా రిలీజ్

పలు దేశాల్లో భారీగా రిలీజ్

KGF Chapter 1 సాధించిన విజయంతో KGF Chapter 2 చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడటం తెలిసిందే. అయితే పలు దేశాల నుంచి భారతీయ ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో చిన్న చిన్న దేశాల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, న్యూ గినియా, సింగపూర్, దుబాయ్, యూరప్ దేశాల్లో, మలేషియాలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

 తొలి రోజే 4 మిలియన్ డాలర్లు

తొలి రోజే 4 మిలియన్ డాలర్లు

KGF Chapter 2 సినిమాను భారతీయ దక్షిణాది భాషల్లోను, అలాగే హిందీ వెర్షన్‌ను భారీగా రిలీజ్ చేశారు. హిందీ వెర్షన్‌ను 1100 స్క్రీన్లలో, దక్షిణాది భాషల వెర్షన్‌ను 2900 స్క్రీన్లలో ప్రదర్శించారు. దాంతో తొలి రోజే 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 38 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

తొలి రోజు అమెరికాలో

తొలి రోజు అమెరికాలో

KGF Chapter 2 మూవీ ఉత్తర అమెరికాలో వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తున్నది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 912,578 అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే తొలి రోజున మరో 796,610 అమెరికన్ డాలర్లను ఖాతాలో వేసుకొన్నది.

రెండో రోజు యూఎస్‌లో

రెండో రోజు యూఎస్‌లో

ఇక KGF Chapter 2 మూవీ రెండో రోజు కూడా కలెక్షన్ల ప్రవాహం కొనసాగింది. అమెరికాలో రెండో రోజున కడపటి వార్తలు అందే సరికి 750,544 అమెరికన్ డాలర్లను రాబట్టింది. దీంతో మొత్తంగా 2,459,732 డాలర్లను వసూలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాల 19 కోట్ల షేర్‌ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 35 కోట్ల గ్రాస్‌ను సాధించింది.

సింగపూర్‌లోను అదే హవా

సింగపూర్‌లోను అదే హవా

KGF Chapter 2 మూవీ క్రేజ్ సింగపూర్‌లోను భారీగా కనిపించింది. తొలి రోజు ఈ సినిమా 500000కు పైగా అమెరికన్ డాలర్లను రాబట్టింది. రెండో రోజు కూడా 300k నమోదయ్యే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో హిందీ వెర్షన్‌కు 746,791, నాన్ హిందీ వెర్షన్‌కు371,234 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది.మొత్తంగా 1,118,025 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 6.31 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

రెండో రోజు కేజీఎఫ్2 బ్రేక్ ఈవెన్‌

రెండో రోజు కేజీఎఫ్2 బ్రేక్ ఈవెన్‌

KGF Chapter 2 చిత్రం గత రెండు రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. ఓవర్సీస్‌లో తొలి రోజు 24 కోట్ల షేర్ సాధించగా, రెండో రోజు సుమారు 18 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్ల మేర జరిగింది. తాజా వసూళ్లను బేరిజు వేసుకొంటే రెండో రోజు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X