KGF Chapter 2 collections కొనసాగుతున్న కలెక్షన్ల సునామీ.. దేశంలో మూడో చిత్రంగా రికార్డు
KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని కొనసాగిస్తున్నది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన అన్ని చిత్రాలను వెనక్కి నెట్టి వసూళ్ల రేసులో దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుపై కేజీఎఫ్2 చిత్రం కన్నేసింది. అయితే 25వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బాహుబలి2పై కన్నేసిన కేజీఎఫ్2
కేజీఎఫ్2 చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. దేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన మూడో చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ఎదురే లేకుండా పోయింది. ఇటీవల RRR రికార్డును బ్రేక్ చేసిన ఈ చిత్రం బాహుబలి 2 సినిమా కలెక్షన్లపై నజర్ పెట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరిలో అమీర్ ఖాన్ దంగల్ చిత్రం ప్రథమ స్థానంలో ఉండగా, రాజమౌళి రూపొందించిన బాహుబలి2 చిత్రం రెండోస్థానంలో ఉంది.

తమిళనాడులో రికార్డు స్థాయి వసూళ్లు
తమిళనాడులో KGF Chapter 2 ప్రభంజనం భారీగా కొనసాగుతున్నది. చెన్నై సిటీలో 24వ రోజున ఈ చిత్రం అరుదైన రికార్డును సాధించింది. ఆదివారం రోజున ఈ చిత్రం 10.11 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. గతంలో చెన్నై సిటీలో 10 గ్రాస్ వసూళ్ల రికార్డును తుడిచిపెట్టింది. దాంతో ఈ చిత్రం తమిళనాడులో 50 కోట్ల షేర్‌ను సాధించిన ఘనతను సొంతం చేసుకొన్నది.

దుమ్ము రేపుతున్న హిందీ వెర్షన్
ఇక KGF Chapter 2 హిందీ వెర్షన్‌కు ఎన్ని సినిమాలు వచ్చినా అడ్డులేని పరిస్థితి నెలకొన్నది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం నుంచి ఎదురైన పోటీని తట్టుకొని 25వ రోజున కూడా భారీ వసూళ్లను సాధింది. 4వ వారంలో శుక్రవారం 3.85 కోట్లు, శనివారం 6.25 కోట్లు, ఆదివారం 6.25 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 412 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

తెలుగులో 100 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో కూడా KGF Chapter 2 చిత్రం హవా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 82.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం 100 కోట్ల షేర్ కలెక్షన్లకు చేరువైంది. ఇప్పటి వరకు 132 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించేందుకు సిద్ధంగా ఉంది.

ఎంత లాభం వచ్చిందంటే?
ఇక ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 చిత్రం 24వ రోజు నాటికి 1130 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 25వ రోజున ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 1150 మార్కును అధిగమించింది. ఈ చిత్రం ఇప్పటికే 211 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











