KGF Chapter 2 day 5 Hindi బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన కేజీఎఫ్2.. ఒక రోజు ముందుగానే 200 కోట్లు..

KGF Chapter 2 చిత్రం అన్ని భాషల్లోను దండిగా కలెక్షన్లను రాబడుతున్నది. ఓ పక్క భారీగా వసూళ్లు రాబడుతుంటే.. మరో పక్క రికార్డులు ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతున్నాయి. పలు భాషల్లో ఆల్‌టైమ్ రికార్డుల దిశగా కేజీఎఫ్2 చిత్రం దూసుకెళ్తున్నది. ఈ సినిమా ప్రస్తుతం బాహుబలి2 సాధించిన రికార్డును బ్రేక్ చేయడానికి సిద్దమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

200 కోట్ల క్లబ్‌లో బాహుబలి

200 కోట్ల క్లబ్‌లో బాహుబలి


దేశ సినిమా పరిశ్రమలో బాహుబలి2 సంచలనంగా మారడం తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే బాహుబలి హిందీ వెర్షన్‌ కేవలం ఆరు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి2 సినిమా రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ బాహుబలి2 రికార్డులపై కేజీఎఫ్2 కన్నేసింది.

కేజీఎఫ్2 హిందీ వెర్షన్ అడ్వాన్సు బుకింగ్

కేజీఎఫ్2 హిందీ వెర్షన్ అడ్వాన్సు బుకింగ్


హిందీ భాషలో డబ్బింగ్ చిత్రంగా రిలీజైన KGF Chapter 2 చాఫ్టర్ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకుల భారీగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్ విషయానికి వస్తే.. హిందీలోనే 39 కోట్లు రాబట్టింది. రెండో రోజున 28.90 కోట్లు, మూడో రోజున 27 కోట్లు, నాలుగో రోజున 33.55 కోట్లు వసూలు చేసింది. అయితే ప్రతీ సినిమాకు చెక్‌పాయింట్‌గా మారే సోమవారం 11.10 కోట్ల మేర అడ్వాన్సు బుకింగ్ నమోదైంది.

5 రోజుల్లోనే 200 కోట్లు

5 రోజుల్లోనే 200 కోట్లు


అయితే KGF Chapter 2 సినిమా హిందీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 53.95 కోట్లు, రెండో రోజున 46.79 కోట్లు, మూడో రోజున 42.90 కోట్లు, నాలుగో రోజున 50.35 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 193.99 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. తాజాగా 10 కోట్ల మేర అడ్వాన్సు బుకింగ్‌తో హిందీలో అతివేగంగా 200 కోట్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్2 చరిత్ర సృష్టించింది.

హిందీలో అరుదైన రికార్డు

హిందీలో అరుదైన రికార్డు


KGF Chapter 2 సాగిస్తున్న కలెక్షన్ల జైత్రయాత్ర గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కేజీఎఫ్2 చిత్రం మరో చరిత్రను సృష్టించింది. 200 కోట్ల క్లబ్‌లో వేగంగా చేరిన సినిమాగా ఘనతను సాధించింది. బాహుబలి2 6 రోజుల్లో సాధిస్తే.. కేజీఎఫ్2 సినిమా కేవలం 5 రోజుల్లోనే అధిగమించింది అని తరణ్ ఆదర్శ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

600 కోట్లపై కన్నేసిన ప్రశాంత్ నీల్

600 కోట్లపై కన్నేసిన ప్రశాంత్ నీల్


KGF Chapter 2 సినిమా ఇతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఐదో రోజు 100 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్కుకు చేరువైంది. ఓవర్సీస్‌లో కూడా 100 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో 5వ రోజున ఈ సినిమా 600 క్లబ్‌లో చేరే ఛాన్సులు భారీగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X