KGF Chapter 2 day 5 Collections దంగల్ రికార్డుపై గురిపెట్టిన రాకీ భాయ్.. 600 కోట్ల క్లబ్‌లోకి కేజీఎఫ్2

ప్రపంచ బాక్సాఫీస్ వద్ద KGF Chapter 2 చిత్రం ఎదురే లేకుండా దూసుకుపోతున్నది. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ సంచలనంగా మారింది. విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లను రాబడుతున్నది. 5వ రోజు కూడా కలెక్షన్ల పరంగా మెరుగైన ఫలితాన్ని రాబట్టింది. దాంతో దేశవ్యాప్తంగా సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నది. 5వ రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే..

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల 5వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. KGF Chapter 2 నైజాంలో 2.46 కోట్లు, సీడెడ్‌లో 74 లక్షలు, ఉత్తరాంధ్రలో 52 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 42 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 లక్షలు, గుంటూరు జిల్లాలో 28 లక్షలు, కృష్ణా జిల్లాలో 26 లక్షలు, నెల్లూరు జిల్లాలో 19 లక్షలు వసూలు చేసింది. దీంతో 5వ రోజున 5.10 కోట్ల షేర్, 8.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5 రోజుల్లో నైజాం, ఆంధ్రాలో

5 రోజుల్లో నైజాం, ఆంధ్రాలో

ఆంధ్రా, నైజాంకు సంబంధించిన మొత్తం 5 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 30.63 కోట్లు, సీడెడ్‌లో 8.17 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.34 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 3.98 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.43 కోట్లు, గుంటూరు జిల్లాలో 3.25 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.92 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.94 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం 58.66 కోట్లు షేర్, 93 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

దంగల్ రికార్డుకు చేరువగా కేజీఎఫ్2

దంగల్ రికార్డుకు చేరువగా కేజీఎఫ్2

KGF Chapter 2 చిత్రం హిందీలో 5వ రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊపు కొనసాగిస్తే.. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హిందీలో దంగల్ చిత్రం మొత్తంగా 270 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కేజీఎఫ్2 చిత్రం దంగల్ వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.

హిందీలో 5వ రోజులు కలెక్షన్లు

హిందీలో 5వ రోజులు కలెక్షన్లు

ఇక హిందీలో KGF Chapter 2 చిత్రం కలెక్షన్ల ప్రవాహం కొనసాగుతున్నది. తొలి రోజు 53.95 కోట్లు, రెండో రోజు 46.79, మూడో రోజు 42.90 కోట్లు, ఆదివారం అంటే నాలుగో రోజు 50.35 కోట్లు, సోమవారం అంటే ఐదో రోజు 25.27 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 219.56 కోట్ల వసూలు చేసింది.

5వ రోజున వరల్డ్ వైడ్ కలెక్షన్లు

5వ రోజున వరల్డ్ వైడ్ కలెక్షన్లు

కేజీఎఫ్2 చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనే ఎదురేలేకుండా పోయింది. ఉత్తర భారతదేశంలో 30 కోట్లు, తెలంగాణ, ఆంధ్రాలో 16 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్‌లో 10 కోట్లు వసూలు చేసింది. దాంతో 5వ రోజున 80 కోట్ల షేర్, 102 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా 5వ రోజు వసూళ్లు..

ప్రపంచవ్యాప్తంగా 5వ రోజు వసూళ్లు..

ఇక ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 మొత్తం 5 రోజుల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలో 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్లు, తమిళనాడులో 36.25 కోట్లు, కేరళలో 33.75 కోట్లు, హిందీ, ఇతర రాష్టాల్లో కలిపి 256 కోట్లు, ఓవర్సీస్‌లో 104 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం 623.80 కోట్ల గ్రాస్‌ను, 311.15 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X