KGF 2 day 6 collections ఉత్తరాదిలో కలెక్షన్ల జైత్రయాత్ర... సరికొత్త రికార్డుకు చేరువైన రాకీభాయ్

దేశవ్యాప్తంగా KGF Chapter 2 వసూళ్ల పండుగ కొనసాగుతూనే ఉంది. విడుదలైన అన్ని సెంటర్లలో ఈ చిత్రం భారీగా కలెక్షన్లను రాబడుతుండటం సినీ, డిస్టిబ్యూటర్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. లాక్‌డౌన్ తర్వాత సినీ పరిశ్రమకు నైతికంగా మనోబలాన్ని పెంచే దిశగా ఈ సినిమా కలెక్షన్లు నమోదు అవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇక KGF Chapter 2 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

వర్కింగ్ డేస్‌లో కూడా భారీగా

వర్కింగ్ డేస్‌లో కూడా భారీగా

KGF Chapter 2 సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. అంతేకాకుండా లాంగ్ వీకెండ్‌లో సెలవులు కూడా కలిసి రావడంతో భారీగా కలెక్షన్లు నమోదయ్యాయి. వారాంతంలో రికార్డు వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వర్కింగ్ డేస్‌లో స్వల్పంగా కలెక్షన్లు క్షీణించాయి. కాకపోతే ప్రతీ చోట గౌరవప్రదమైన గణాంకాలు కనిపించడం ఈ సినిమా యూనిట్‌లో జోష్ పెరుగుతున్నది.

నైజాం, ఆంధ్రాలో 6వ రోజు

నైజాం, ఆంధ్రాలో 6వ రోజు

తెలుగు రాష్ట్రాల్లో KGF Chapter 2 మూవీ 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.68 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో ఈ చిత్రం 53 లక్షలు, ఉత్తరాంధ్రలో 26 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 26 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 లక్షలు, గుంటూరులో 20 లక్షలు, కృష్ణా జిల్లాలో 19 లక్షలు, నెల్లూరు జిల్లాలో 12 లక్షలు వసూలు చేసింది. దాంతో 3.51 కోట్లు షేర్, 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో KGF Chapter 2 చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరువైంది. ఈ సినిమా గత ఐదు రోజుల్లో 59 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇక ఆరో రోజున మరో 3.51 కోట్లు రాబట్టడం జరిగింది. దాంతో కేజీఎఫ్2 చిత్రం 62.17 కోట్ల షేర్, 98.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో ముందుకు సాగుతున్నది. 7వ రోజున ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం కనిపిస్తున్నది.

హిందీలో 250 కోట్లు

హిందీలో 250 కోట్లు

KGF Chapter 2 హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఉత్తరాది ప్రేక్షకులపై గట్టి పట్టు సాధించినట్టు 6వ రోజు కలెక్షన్లు రుజువు చేశాయి. గత ఐదు రోజుల్లో 218 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. 6వ రోజున మరో 19.14 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 238.7 కోట్లు నమోదు చేసింది. ఇక 7వ రోజు ఈ సినిమా 250 కోట్ల మైలురాయిని దాటే అవకాశం కనిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కేజీఎఫ్2 చిత్రం 108.80 కోట్ల గ్రాస్, 62.8 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక తమిళనాడులో 20.70 కోట్ల షేర్ 41.5 కోట్ల గ్రాస్, కేరళలో 16.15 కోట్ల షేర్ 37.15 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 54.35 కోట్ల షేర్, 110.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 676 కోట్లకుపైగా గ్రాస్, 336 కోట్ల షేర్‌ను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X