KGF 2 day7 collections బాహుబలి, కాశ్మీర్ ఫైల్స్ రికార్డ్స్ బ్రేక్.. అత్యధిక వసూళ్లు సాధించిన 8వ చిత్రంగా!

ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొంటున్న KGF Chapter 2 చిత్రం తొలివారాన్ని దిగ్విజయంగా ముగించే ప్రయత్నం చేసింది. గత ఏడు రోజులుగా విడుదలైన ప్రతీ చోట రికార్డు వసూళ్లను సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించిన తొలి కన్నడ చిత్రంగా అరుదైన రికార్డులను సొంతం చేసుకొంటున్నది. ఈ చిత్రం 7వ రోజున సాధించిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

హిందీలో 250 కోట్ల క్లబ్‌లో

హిందీలో 250 కోట్ల క్లబ్‌లో

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద KGF Chapter 2 చిత్రం గత ఆరు రోజుల్లో 239 కోట్ల నికర వసూళ్లను సాధించింది. బాలీవుడ్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్ల రికార్డుతోపాటు పలు అగ్ర హీరోల వసూళ్లను అధిగమించింది. తాజాగా సంచలనం సాధించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన కలెక్షన్ల రికార్డును కేజీఎఫ్2 బ్రేక్ చేసింది.

7వ రోజున 17.22 కోట్లు వసూలు చేయడంతో 250 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇటీవల కాలంలో 250 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా కేజీఎఫ్2 ఘనతను సాధించింది.

కేరళలో ఆల్ టైమ్ రికార్డు

కేరళలో ఆల్ టైమ్ రికార్డు

KGF Chapter 2 చిత్రం కేరళలో కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తూ ప్రతీ రోజు భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంటున్నది. గత ఆరు రోజుల్లో 38.3 కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం మరో 3.5 కోట్లు వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 41.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో ఇదే అత్యుత్తమ వసూళ్ల రికార్డుగా మారింది.

ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డు

ఇక ఆస్ట్రేలియాలో కూడా KGF Chapter 2 వసూళ్ల ప్రభంజనం కొనసాగుతున్దని. తొలివారం ముగిసిన తర్వాత హిందీ వెర్షన్‌ 1,959,079 ఆస్ట్రేలియన్ డాలర్లు, నాన్ హిందీ 742,131 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో మొత్తంగా 2,701,210 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 15.31 కోట్ల రూపాయలను ఆర్జించింది.

తమిళంలో అదనంగా 150 స్క్రీన్లు

తమిళంలో అదనంగా 150 స్క్రీన్లు

తమిళంలో KGF Chapter 2 మూవీ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతున్నది. బీస్ట్ సినిమా కారణంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది. అయితే బీస్ట్ డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం కేజీఎఫ్2 కోసం థియేటర్లను కేటాయిస్తున్నారు. రెండో వారంలో కేజీఎఫ్2 కోసం అదనంగా 150 స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అలాగే బీస్ట్ సినిమాకు సంబంధించి 200 స్క్రీన్లను తగ్గించారు. గత ఆరు రోజుల్లో 55.49 కోట్లు నమోదు చేసిన ఈ చిత్రం 7వ రోజున అదనంగా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో KGF Chapter 2 చిత్రం 7వ రోజున నైజాంలో 1.12 కోట్లు, సీడెడ్‌లో 37 లక్షలు, ఉత్తరాంధ్రలో 23 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 16 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 లక్షలు, గుంటూరులో జిల్లాలో 13 లక్షలు, కృష్ణా జిల్లాలో 12 లక్షలు, నెల్లూరు జిల్లాలో 9 లక్షలు వసూలు చేసింది. దీంతో 2.34 కోట్లు నికరంగా, 4.10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. గత 7 రోజుల్లో 64.51 కోట్ల షేర్, 102.60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా 720 కోట్లకుపైగా

ప్రపంచవ్యాప్తంగా 720 కోట్లకుపైగా

ఇక ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 చిత్రం గత ఆరు రోజుల్లో 676.8 కోట్లు వసూలు చేసింది. దేశ బాక్సాఫీస్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన 8వ చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అంతేకాకుండా బాహుబలి 1 సాధించిన లైఫ్ టైమ్ రికార్డులను అధిగమించింది. 7వ రోజు మరో 43 కోట్ల గ్రాస్, 20.74 కోట్ల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటకలో 115.30 కోట్ల గ్రాస్, హిందీ, ఇతర రాష్ట్రాల్లో కలిపి 300 గ్రాస్ వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 720 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X