KGF Chapter 2 Collection: తెలుగులో కేజీఎఫ్ సంచలన రికార్డు.. ఒక్క హైదరాబాద్‌లోనే 4 కోట్లకు పైగా!

గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో దక్షిణాదిలో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అలా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే 'KGF Chapter 1'. కన్నడ బడా హీరో రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడంతో అన్ని చోట్లా దీనికి మంచి స్పందన వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాకు 'KGF Chapter 2' పేరిట సీక్వెల్‌ను రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

 రాఖీ భాయ్ మళ్లీ వస్తున్నాడు

రాఖీ భాయ్ మళ్లీ వస్తున్నాడు

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రమే 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.

 అధీర ఎంట్రీతో మారిన సీన్

అధీర ఎంట్రీతో మారిన సీన్


రాఖీ భాయ్ కేజీఎఫ్‌ను సొంతం చేసుకోవడంతో చాప్టర్ 1 పూర్తైంది. ఇక, ఇప్పుడు అతడిని ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో 'KGF Chapter 2' కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఇక, ఇందులో అధీరాగా సంజయ్ దత్ నటించారు. ఈ భాగంలో రాఖీ భాయ్ పాత్రను మరింత హైలైట్ చేయబోతున్నారట.

 రిలీజ్‌కు రెడీ.. భారీ స్థాయిలో

రిలీజ్‌కు రెడీ.. భారీ స్థాయిలో

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'KGF Chapter 2' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.

అత్యధిక బిజినెస్‌తో రికార్డు

అత్యధిక బిజినెస్‌తో రికార్డు


ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న 'KGF Chapter 2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అన్ని భాషల్లో హక్కులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అలాగే రిలీజ్ కూడా గ్రాండ్‌గా చేస్తున్నారు. తెలుగులోనూ ఇది రికార్డు బిజినెస్ చేసుకుంది.

 హైదరాబాద్‌ టికెట్ రేట్లిలా

హైదరాబాద్‌ టికెట్ రేట్లిలా

తెలుగు రాష్ట్రాల్లో 'KGF Chapter 2' మూవీకి రూ. 78 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే భారీగా విడుదల కాబోతుంది. దీంతో హైదరాబాద్‌లో ఈ సినిమా టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు. సింగిల్, ఏషియన్ థియేటర్లలో బాల్కనీ రూ. 210, మిగిలిన క్లాసుల్లో రూ. 150, 90గా ఫిక్స్ చేశారు. అలాగే, మల్టీఫ్లెక్స్‌ల్లో 400 పైగానే రేటు పెట్టేశారు.

హైదరాబాద్‌లో రికార్డు రేంజ్

హైదరాబాద్‌లో రికార్డు రేంజ్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 'KGF Chapter 2' టికెట్ బుకింగ్స్ గత రాత్రి నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక, ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ 399 షోలకు గానూ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచగా.. అందులో 85 శాతం అమ్ముడైపోయాయి. మిగిలిన థియేటర్లు ఒక్కొక్కటిగా బుక్‌మైషోలో కనిపిస్తున్నాయి.

రిలీజ్‌కు ముందే 4 కోట్లతో

రిలీజ్‌కు ముందే 4 కోట్లతో

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'KGF Chapter 2' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అప్పుడే రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ కూడా వసూలు అయిపోయింది. తద్వారా వేగంగా ఇన్ని కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరింది. మరీ ముఖ్యంగా ఇంత వేగంగా 4 కోట్ల గ్రాస్‌ను చేరుకున్న మొదటి డబ్బింగ్ మూవీగా ఇది రికార్డులకెక్కింది. ఈ మొత్తం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X