KGF 10 Days Collections: మళ్లీ కేజీఎఫ్ హవా.. ఒక్కరోజులో 20 కోట్లకు పైగా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

పేరుకు కన్నడ సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది 'కేజీఎఫ్ చాప్టర్ 1'. స్టైలిష్ హీరో యశ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ హవాను చూపించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అందుకు అనుగుణంగానే మంచి స్పందనను దక్కిచుకుని విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 10 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది? అనేవి చూద్దాం పదండి!

కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్ రీఎంట్రీ

కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్ రీఎంట్రీ


రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్


విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిసింది.

 10 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

10 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ 2' మూవీ 10వ రోజూ ఏపీ, తెలంగాణలో బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 1.04 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. 10వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 2.24 కోట్లు షేర్, రూ. 4.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

 10 రోజులకు కలిపి ఎంత వచ్చింది

10 రోజులకు కలిపి ఎంత వచ్చింది


'కేజీఎఫ్ 2'కు 10 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 36.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.41 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.79 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.99 కోట్లు, గుంటూరులో రూ. 3.90 కోట్లు, కృష్ణాలో రూ. 3.52 కోట్లు, నెల్లూరులో రూ. 2.36 కోట్లతో.. కలుపుకుని రూ. 69.92 కోట్లు షేర్, రూ. 111.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

 మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో 10 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 69.92 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 74.25 కోట్లు, తమిళనాడులో రూ. 27.50 కోట్లు, కేరళలో రూ. 21.55 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 150.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60.60 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 404.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 816.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?


'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 79 కోట్లుగా నమోదైంది. ఇక, ఇది 10 రోజుల్లోనే రూ. 69.92 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 9.08 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

 ఒక్క రోజే 20 కోట్లకు పైగా వసూలు

ఒక్క రోజే 20 కోట్లకు పైగా వసూలు


క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి పదో రోజు కూడా అన్ని ఏరియాల్లో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 20 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ఫలితంగా ఎన్నో అరుదైన మైలురాళ్లను చేరుకోవడంతో పాటు కొన్ని రికార్డులను కూడా ఖాతాలో వేసుకుని సత్తా చాటుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X