KGF 11 Days Collections: సండే కేజీఎఫ్ సంచలనం.. ఒక్కరోజే అన్ని కోట్లా.. ఒక్కరోజుతో RRR రికార్డు సేఫ్

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సౌతిండియాలో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో ఎక్కువ శాతం పాన్ ఇండియా రేంజ్‌లో బహు భాషా చిత్రాలు వస్తున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. కన్నడ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది.

దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రాఖీ భాయ్ మళ్లీ వచ్చేశాడుగా

రాఖీ భాయ్ మళ్లీ వచ్చేశాడుగా

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ తీసిన చిత్రమే'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

ఆరంభం నుంచే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ తెలిపింది.

11 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

11 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

ఏపీ, తెలంగాణలో 'కేజీఎఫ్ 2' మూవీ 11వ రోజూ సత్తా చాటింది. దీంతో నైజాంలో రూ. 1.84 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్‌లో రూ. 21 లక్షలు, వెస్ట్‌లో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. 11వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 3.36 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

11 రోజులకు కలిపి ఎంత వచ్చింది

11 రోజులకు కలిపి ఎంత వచ్చింది

'కేజీఎఫ్ 2'కు 11 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 38.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.68 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.13 కోట్లు, గుంటూరులో రూ. 4.08 కోట్లు, కృష్ణాలో రూ. 3.69 కోట్లు, నెల్లూరులో రూ. 2.48 కోట్లతో.. కలుపుకుని రూ. 73.52 కోట్లు షేర్, రూ. 117.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో 11 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 73.52 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 79.60 కోట్లు, తమిళనాడులో రూ. 33.10 కోట్లు, కేరళలో రూ. 22.58 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 162.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 74.15 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లోనే రూ. 445.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 900.55 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 79 కోట్లుగా నమోదైంది. ఇక, ఇది 11 రోజుల్లోనే రూ. 73.52 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 5.48 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

ఒక్క రోజుతో RRR రికార్డు సేఫ్

ఒక్క రోజుతో RRR రికార్డు సేఫ్

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 11 రోజుల్లోనూ అన్ని ఏరియాల్లో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. ఫలితంగా ఎన్నో అరుదైన రికార్డులను చేరుకుంది. ఇక, RRR మూవీ పది రోజుల్లోనే ఈ మార్కును చేరుకోగా.. ఇది 11వ రోజున అందుకోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X