KGF 15 Days Collections: కేజీఎఫ్‌కు దెబ్బ మీద దెబ్బ.. 15 రోజుల్లోనే అన్ని కోట్లు.. RRRను దాటాలంటే!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రూపొందినా.. అన్ని చోట్లా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట తెరకెక్కించిన సీక్వెల్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి కూడా ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో హవాను చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గుతున్నాయి. మరి 'కేజీఎఫ్ చాప్టర్ 2' 15 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఏ రికార్డులు అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

కేజీఎఫ్ కోసం రాఖీ మళ్లీ వచ్చాడు

కేజీఎఫ్ కోసం రాఖీ మళ్లీ వచ్చాడు

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన యాక్షన్ మూవీనే ‘KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్


రిలీజ్‌కు ముందే హైప్ క్రియేట్ చేసుకున్న ‘KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

15 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

15 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


15వ రోజూ ‘కేజీఎఫ్ 2' మూవీ ఏపీ, తెలంగాణలో నిరాశ పరిచింది. దీంతో నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 15వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 56 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది

15 రోజులకు కలిపి ఎంతొచ్చింది

‘కేజీఎఫ్ 2'కు 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 39.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.27 కోట్లు, గుంటూరులో రూ. 4.30 కోట్లు, కృష్ణాలో రూ. 3.88 కోట్లు, నెల్లూరులో రూ. 2.58 కోట్లతో.. కలుపుకుని రూ. 76.77 కోట్లు షేర్, రూ. 123.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో 15 రోజుల్లో ‘కేజీఎఫ్ 2'కు రూ. 76.77 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 85.50 కోట్లు, తమిళనాడులో రూ. 37.10 కోట్లు, కేరళలో రూ. 24.45 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 175.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 80.45 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ. 479.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 972.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?


‘కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 15 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 479.32 కోట్లతో.. రూ. 132.32 కోట్ల లాభాలు అందుకుంది. తెలుగులో మరో రూ. 2.23 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

Recommended Video

Acharya Movie Public Talk మెగా ఫ్యాన్స్ ని మెప్పించిన కొరటాల | Telugu Filmibeat
RRR మూవీకి చేరువగా వచ్చింది

RRR మూవీకి చేరువగా వచ్చింది

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘KGF Chapter 2' మూవీకి 15 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 479.32 కోట్లు షేర్‌తో పాటు రూ. 972.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. క్రమంగా కలెక్షన్లు తగ్గుతున్నా బాగానే రాణిస్తోంది. ఇక, ఈ చిత్రం RRR మూవీ కలెక్షన్లను చేరుకోవాలంటే దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X