KGF 18 Days Collections: తెలుగులో కేజీఎఫ్ రికార్డు.. అన్ని కోట్ల టార్గెట్ ఉఫ్.. RRR తర్వాత ఈ మూవీనే
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతోన్న యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా.. విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో జాతీయ అవార్డులు కూడా అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తెరకెక్కించారు.
దీనికి కూడా ఆరంభం నుంచే మంచి స్పందన దక్కుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై ఓ రేంజ్‌లో ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈ సినిమా వీకెండ్‌లో సత్తాను చాటుకుంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 18 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఏ రికార్డులు అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

సీక్వెల్ కోసం మళ్లీ కలిసిన స్టార్లు
యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన్న ఫుల్ యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్
ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

18 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
18వ రోజూ 'కేజీఎఫ్ 2' మూవీ ఏపీ, తెలంగాణలో చక్కగా రాణించింది. దీంతో నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. 18వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 97 లక్షలు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

18 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'కేజీఎఫ్ 2'కు 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 40.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.29 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.42 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.38 కోట్లు, గుంటూరులో రూ. 4.47 కోట్లు, కృష్ణాలో రూ. 4.00 కోట్లు, నెల్లూరులో రూ. 2.66 కోట్లతో.. కలుపుకుని రూ. 79.27 కోట్లు షేర్, రూ. 127.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత
ఏపీ, తెలంగాణలో 18 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 79.27 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 92.55 కోట్లు, తమిళనాడులో రూ. 43.27 కోట్లు, కేరళలో రూ. 25.40 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 187.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 84.65 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లోనే రూ. 512.72 కోట్లు షేర్‌తో పాటు రూ. 1039.55 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?
'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 18 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 512.72 కోట్లతో.. రూ. 165.72 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 27 లక్షలు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

RRR తర్వాత నాలుగో స్థానం
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.27 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. ఫలితంగా 2022లో విజయాన్ని అందుకున్న నాలుగో సినిమాగా రికార్డుకెక్కింది. ఇప్పటికే ఈ ఏడాది 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'RRR' తెలుగులో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











