KGF 19 Days Collections: RRRను దాటేసిన కేజీఎఫ్.. ఆచార్యతో పోటీగా.. మొత్తం లాభాలే అన్ని కోట్లు

మిగిలిన జోనర్లతో పోలిస్తే యాక్షన్ ఎంటర్‌టైనర్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతూ ఉంటుంది. అలాంటిది హీరోకు అదిరిపోయే ఎలివేషన్ సీన్స్, దానికి అనుగుణంగానే బలమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో వచ్చిన సినిమా అయితే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా కొన్నేళ్ల క్రితం వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'.

ఇది పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 19 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

రాఖీ భాయ్ సామ్రాజ్యం అదిరేలా

రాఖీ భాయ్ సామ్రాజ్యం అదిరేలా

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన ఫుల్ యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

19 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

19 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


'కేజీఎఫ్ 2' 19వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో బాగానే రాణించింది. దీంతో నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 19వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 27 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

19 రోజులకు కలిపి ఎంతొచ్చింది

19 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'కేజీఎఫ్ 2'కు 19 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.33 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.43 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.49 కోట్లు, కృష్ణాలో రూ. 4.02 కోట్లు, నెల్లూరులో రూ. 2.67 కోట్లతో.. కలుపుకుని రూ. 79.54 కోట్లు షేర్, రూ. 128.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో 19 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 79.54 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 93.50 కోట్లు, తమిళనాడులో రూ. 44 కోట్లు, కేరళలో రూ. 25.50 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 189.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 85.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లోనే రూ. 517.59 కోట్లు షేర్‌తో పాటు రూ. 1050 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 19 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 517.59 కోట్లతో.. రూ. 170.59 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 54 లక్షలు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

RRRకి ఎక్కువ.. ఆచార్యకు పోటీ

RRRకి ఎక్కువ.. ఆచార్యకు పోటీ

క్రేజీ కాంబోలో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 19వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 27 లక్షలు షేర్ వచ్చింది. ఇది RRR సాధించిన షేర్ (14 లక్షలు) కంటే ఎక్కువ మొత్తం అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆచార్య సోమవారం రూ. 53 లక్షలు రాబట్టింది. అంటే కేజీఎఫ్ దీనికి గట్టి పోటీని ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X