KGF 2 Weeks Collections: 347 కోట్లకు అమ్మితే.. 2 వారాల్లోనే ఇలా.. RRR రికార్డుకు కొద్ది దూరంలోనే!
రాకింగ్ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఇది నేషనల్ రేంజ్‌లో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రానికి 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట సీక్వెల్‌ను రూపొందించారు.
మొదటి భాగం భారీ సక్సెస్ కావడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌పై కలెక్షన్ల జల్లు పడుతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' రెండు వారాల్లో ఎంత వసూలు చేసింది? ఏ రికార్డులు అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

రాఖీ భాయ్ అదిరిపోయే రీఎంట్రీ
కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను చేసిన విషయం తెలిసిందే.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్
ఆరంభంలోనే భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

14 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'కేజీఎఫ్ 2' మూవీ ఏపీ, తెలంగాణలో 14వ రోజూ నిరాశ పరిచింది. దీంతో నైజాంలో రూ. 39 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 14వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 76 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

2 వారాలకు కలిపి ఎంతొచ్చింది
'కేజీఎఫ్ 2'కు రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 39.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.64 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.20 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.25 కోట్లు, గుంటూరులో రూ. 4.26 కోట్లు, కృష్ణాలో రూ. 3.85 కోట్లు, నెల్లూరులో రూ. 2.57 కోట్లతో.. కలుపుకుని రూ. 76.21 కోట్లు షేర్, రూ. 122.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత
ఏపీ, తెలంగాణలో 2 వారాల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 76.21 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 84.35 కోట్లు, తమిళనాడులో రూ. 36.90 కోట్లు, కేరళలో రూ. 24.25 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 172.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 79.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 2 వారాల్లోనే రూ. 473.16 కోట్లు షేర్‌తో పాటు రూ. 957.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?
'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 2 వారాల్లో ఓవరాల్‌గా రూ. 473.16 కోట్లతో.. రూ. 126.16 కోట్ల లాభాలు అందుకుంది. తెలుగులో మరో రూ. 2.79 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

RRR మూవీకి చేరువగా వచ్చింది
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 2 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 473.16 కోట్లు షేర్‌తో పాటు రూ. 957.65 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. RRR మూవీ ఏకంగా రూ. 535.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 967 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా షేర్ పరంగా చాలా దూరంలో ఉన్నా.. గ్రాస్ పరంగా కేజీఎఫ్ మూవీ పది కోట్ల దూరంలోనే ఆగింది.


Click it and Unblock the Notifications











