twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 20 Days Collections: రంజాన్ రోజు రాఖీ హవా.. 20వ రోజు అన్ని కోట్లా.. RRR టోటల్ రికార్డు బ్రేక్

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది.. దేశంలోని చాలా భాషల్లో విడుదలై.. అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించాడు. ఇది కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు జాతీయ అవార్డులనూ అందుకుంది. దీంతో ఈ ఉత్సాహంతోనే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తీశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 20వ రోజైన రంజాన్ నాడు మరింత హవాను చూపించింది. మరి ఈ సినిమా 20 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    దద్దరిల్లేలా రాఖీ భాయ్ రీఎంట్రీ

    దద్దరిల్లేలా రాఖీ భాయ్ రీఎంట్రీ

    కన్నడ స్టార్ హీరో యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు.

    మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!మరోసారి సమంత హాట్ ట్రీట్: అబ్బో ఆమెను ఈ డ్రెస్‌లో చూశారంటే!

    ‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

    ‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్


    క్రేజీ కాంబినేషన్‌లో మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర బిజినెస్ అయింది.

    20 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    20 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    'కేజీఎఫ్ 2' 20వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో సత్తా చాటుకుంది. దీంతో నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 20వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 76 లక్షలు షేర్, రూ. 1.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    బుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమేబుల్లి గౌనులో శ్రీముఖి పరువాల విందు: ఆమెను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే

    20 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    20 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    'కేజీఎఫ్ 2'కు 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.42 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.46 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.44 కోట్లు, గుంటూరులో రూ. 4.55 కోట్లు, కృష్ణాలో రూ. 4.05 కోట్లు, నెల్లూరులో రూ. 2.70 కోట్లతో.. కలుపుకుని రూ. 80.30 కోట్లు షేర్, రూ. 129.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

    మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

    మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

    ఏపీ, తెలంగాణలో 20 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 80.30 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 95.90 కోట్లు, తమిళనాడులో రూ. 42.15 కోట్లు, కేరళలో రూ. 28.05 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 195.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 86.65 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లోనే రూ. 528.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 1076 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    షర్ట్ విప్పేసి షాకిచ్చిన శ్రీయ: తల్లైనా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోతషర్ట్ విప్పేసి షాకిచ్చిన శ్రీయ: తల్లైనా ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత

    టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

    టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

    'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 20 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 528.45 కోట్లతో.. రూ. 181.45 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 1.30 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

    RRR రికార్డును బ్రేక్ చేసేసింది

    RRR రికార్డును బ్రేక్ చేసేసింది

    భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 20వ రోజు రంజాన్ పండుగ సందర్భంగా భారీ స్పందనను దక్కించుకుంది. దీంతో ఈ ఒక్క రోజే పది కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ఇక, ఓవరాల్‌గా ఈ సినిమా 20 రోజుల్లో రూ. 1076 కోట్లు గ్రాస్ అందుకుంది. తద్వారా RRR మూవీ రికార్డు బ్రేక్ చేసింది. ఇది 20 రోజుల్లో రూ. 1049 కోట్లే రాబట్టడం గమనార్హం.

    English summary
    Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Collects Rs 528.45 Cr in 20 Days in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X