KGF 22 Days Collections: కేజీఎఫ్ మరో సంచలన రికార్డు.. అన్ని కోట్ల లాభాలేంటి సామీ!

కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఎవరూ ఊహించని రీతిలో విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తా చాటిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని రూపొందించారు. ఇది కూడా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. దీంతో భారీ అంచనాల నడుమ మూడు వారాల క్రితమే విడుదలైంది. ఇక, దీనికి కూడా ఆరంభం నుంచే భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ మూవీ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో అసలు 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 22 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

కేజీఎఫ్ చాప్టర్ 2తో వచ్చేశారుగా

కేజీఎఫ్ చాప్టర్ 2తో వచ్చేశారుగా

శాండిల్‌వుడ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించారు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్


ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ అయింది.

22 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

22 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ 2' 22వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు కాస్త కోల్పోయింది. దీంతో నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 22వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 36 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్‌ రాబట్టింది.

22 రోజులకు కలిపి ఎంతొచ్చింది

22 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'కేజీఎఫ్ 2'కు 22 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.57 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.49 కోట్లు, గుంటూరులో రూ. 4.62 కోట్లు, కృష్ణాలో రూ. 4.10 కోట్లు, నెల్లూరులో రూ. 2.73 కోట్లతో.. కలుపుకుని రూ. 81.26 కోట్లు షేర్, రూ. 131.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత


ఏపీ, తెలంగాణలో 22 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 81.26 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 98.35 కోట్లు, తమిళనాడులో రూ. 48.40 కోట్లు, కేరళలో రూ. 28.75 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 201.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 89.05 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల్లోనే రూ. 547.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 1108.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 22 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 547.66 కోట్లతో.. రూ. 200.66 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 2.26 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

మరో రికార్డు.. RRR దాటేసేలానే

మరో రికార్డు.. RRR దాటేసేలానే

క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 22 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 547.66 కోట్లు షేర్‌ను రాబట్టి రూ. 200 కోట్ల లాభాలను సొంతం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. అలాగే, ఈ స్పీడ్ చూస్తుంటే RRR ఫుల్ రన్ కలెక్షన్లను కూడా ఈ సినిమా అతి తక్కువ రోజుల్లోనే దాటేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X