KGF 23 Days Collections: అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్.. సొంత ప్రాంతంలోనే అతి చేరువలో వసూళ్లు?

కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఎవరూ ఊహించని రీతిలో విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తా చాటిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హవా చూపించడంతో సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని రూపొందించారు. ఇక ఈ సినిమా కూడా ప్రారంభించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో అసలు 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం

కేజీఎఫ్ చాప్టర్ 2

కేజీఎఫ్ చాప్టర్ 2

శాండిల్‌వుడ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన తాజా చిత్రం 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ నటించగా రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో నటించింది. శ్రీనిధి శెట్టి 'KGF Chapter 2'లో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించగా 19 ఏళ్ళ ఉజ్వల్ ఎడిటర్ గా వ్యవహరించాడు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

'KGF Chapter 2' మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ అయింది.

23 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

23 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


'కేజీఎఫ్ 2' 23వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో కలెక్షన్స్ లో మళ్ళీ డ్రాప్ కనిపించింది. దీంతో నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 22వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 28 లక్షలు షేర్, రూ. 54 లక్షలు గ్రాస్‌ రాబట్టింది.

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

23 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

'కేజీఎఫ్ 2'కు 23 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.53 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.60 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.50 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.51 కోట్లు, గుంటూరులో రూ. 4.65 కోట్లు, కృష్ణాలో రూ. 4.12 కోట్లు, నెల్లూరులో రూ. 2.75 కోట్లతో.. కలుపుకుని రూ. 81.54 ట్లు షేర్, రూ. 131.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో

మిగిలిన భాషల్లో

ఏపీ, తెలంగాణలో 23 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ.81.54 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 98.90 కోట్లు, తమిళనాడులో రూ. 48.95 కోట్లు, కేరళలో రూ. 28.90 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 204.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 89.55 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 23 రోజుల్లోనే రూ. 552.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 1118.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

లాభాలు ఎంత?

లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగగా రూ. 347 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఇక అలా తెలుగులో ఈ సినిమాకు 78 కోట్ల బిజినెస్ జరుపుకోగా 79 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఈ సినిమా 23 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 552.34 కోట్లతో.. రూ. 205.34 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 2.54 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X