KGF 24 Days Collections: తెలుగులో కేజీఎఫ్ గొప్ప రికార్డు.. RRRకు మరో షాక్.. 24 డేస్‌లో అన్ని కోట్లా

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోని సినిమాల స్థాయి భారీగా పెరిగింది. ఫలితంగా ఇండియన్ సినిమాలో సౌత్ వాళ్ల ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో కనిపిస్తోంది. దీనికి కారణం కొంత కాలంగా వస్తున్న చిత్రాలే అని చెప్పొచ్చు. అలా తమ పరిశ్రమతో పాటు దక్షిణాది సత్తాను నిరూపించిన చిత్రాల్లో 'కేజీఎఫ్ చాప్టర్ 1' ఒకటి. ఇది పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో దీనికి కొనసాగింపుగా వచ్చిన మూవీనే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ.. భారీ స్థాయిలో విడుదలైంది. దీనికి ఆరంభం నుంచే స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

భారీ రేంజ్‌లో కేజీఎఫ్ చాప్టర్ 2

భారీ రేంజ్‌లో కేజీఎఫ్ చాప్టర్ 2

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రమే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగింది.

24 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

24 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ 2' 24వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు కొంత పెరిగాయి. దీంతో నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 24వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 46 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్‌ రాబట్టింది.

24 రోజులకు కలిపి ఎంతొచ్చింది

24 రోజులకు కలిపి ఎంతొచ్చింది


'కేజీఎఫ్ 2'కు 24 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.07 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.65 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.54 కోట్లు, గుంటూరులో రూ. 4.70 కోట్లు, కృష్ణాలో రూ. 4.15 కోట్లు, నెల్లూరులో రూ. 2.77 కోట్లతో.. కలుపుకుని రూ. 82 కోట్లు షేర్, రూ. 132.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఆంధ్రా, తెలంగాణలో 24 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 82 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 99.55 కోట్లు, తమిళనాడులో రూ. 49.50 కోట్లు, కేరళలో రూ. 29.10 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 207.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 90.70 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 558.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 1130.20 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 24 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 558.10 కోట్లతో.. రూ. 211.10 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 3 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

మరో రికార్డు.. RRRను దాటేసింది

మరో రికార్డు.. RRRను దాటేసింది

ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 24 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ 82 కోట్లు షేర్‌ను రాబట్టింది. తద్వారా రూ. 3 కోట్ల లాభాలను అందుకుని రికార్డు నెలకొల్పింది. అలాగే, RRR మూవీ 44 రోజుల్లో వసూలు చేసిన గ్రాస్ (1127.80 కోట్లు)ను కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ కేవలం 24 రోజుల్లోనే (1130.20 కోట్లు) దాటేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X