KGF 26 Days Collections: కేజీఎఫ్‌కు భారీ దెబ్బ.. సగానికి సగం కలెక్షన్లు డౌన్.. మరో 40 కోట్లు వస్తే!

పేరుకు కన్నడ సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించడంతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది 'కేజీఎఫ్ చాప్టర్ 1'. మాస్ యాక్షన్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీలో హీరో ఎలివేషన్ సీన్స్ ఏ రేంజ్‌లో బ్లాస్ట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ సినిమాకు వసూళ్లతో పాటు అవార్డులూ దక్కాయి.

ఫలితంగా దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు. ఆరంభంలోనే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని రికార్డులు క్రియేట్ చేసింది. అందుకు అనుగుణంగానే గ్రాండ్‌గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కేజీఎఫ్ 2

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కేజీఎఫ్ 2

కన్నడ స్టార్ హీరో యశ్.. ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందిన యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

క్రేజీ కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

26 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

26 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ 2' 26వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 26వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్‌ రాబట్టింది.

24 రోజులకు కలిపి ఎంతొచ్చింది

24 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'కేజీఎఫ్ 2'కు 26 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.79 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.81 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.57 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.61 కోట్లు, గుంటూరులో రూ. 4.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.22 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.03 కోట్లు షేర్, రూ. 134.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

 మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

26 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'కేజీఎఫ్ 2'కు రూ. 83.03 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 101.15 కోట్లు, తమిళనాడులో రూ. 51.40 కోట్లు, కేరళలో రూ. 30.05 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 211.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 93.85 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 26 రోజుల్లోనే రూ. 571.13 కోట్లు షేర్‌తో పాటు రూ. 1162.05 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. మరో 40 కోట్లు షేర్ వస్తే RRR ఫుల్ రన్‌ వసూళ్లను దాటే అవకాశం ఉంది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 26 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 571.13 కోట్లతో.. రూ. 224.13 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.08 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X