KGF 27 Days Collections: కేజీఎఫ్‌కు ఊహించని వసూళ్లు.. 27వ రోజు కూడా అన్ని కోట్లా!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్ మూవీలను కూడా దాటేసే రేంజ్‌లో మన సినిమాలు ఆడుతున్నాడు. అందుకు ఆద్యం పోసిన చిత్రాల్లో ఒకటి 'బాహుబలి' అయితే, మరొకటి మాత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1' అనే చెప్పుకోవాలి. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం తక్కువ అంచనాలతోనే వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

పక్కా మాస్ సినిమా ‘కేజీఎఫ్ 2’
శాండిల్‌వుడ్ స్టార్ యశ్.. ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందిన మాస్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్
సూపర్ హిట్ కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగింది.

27 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
27వ రోజు 'కేజీఎఫ్ 2' మూవీకి ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో.. 27వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 17 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ రాబట్టింది.

27 రోజులకు కలిపి ఎంతొచ్చింది
'కేజీఎఫ్ 2'కు 27 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.53 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.83 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.62 కోట్లు, గుంటూరులో రూ. 4.82 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.25 కోట్లు షేర్, రూ. 135 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత
27 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'కేజీఎఫ్ 2'కు రూ. 83.25 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 101.55 కోట్లు, తమిళనాడులో రూ. 51.90 కోట్లు, కేరళలో రూ. 30.25 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 212.9 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 94.35 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 27 రోజుల్లోనే రూ. 574.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 1169.25 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?
'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 27 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 574.20 కోట్లతో.. రూ. 227.20 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.25 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











