twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 29 Days Collections: కేజీఎఫ్‌కు కోలుకోలేని దెబ్బ.. 29 రోజుల్లో తొలిసారి ఇంత ఘోరంగా!

    |

    పేరుకు కన్నడ సినిమానే అయినా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రభావాన్ని చూపించి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది 'కేజీఎఫ్ చాప్టర్ 1'. యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబట్టింది. తద్వారా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

    ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

    మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లు అన్నీ మరింత హైప్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రాంతాల రైట్స్ అత్యధిక మొత్తాలకు అమ్ముడు పోయాయి. మొత్తంగా ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ చేసుకుంది.

    ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్లు పొటెత్తాయి. ఇలా చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 29వ రోజైన గురువారం దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 4 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 2 కోట్లు షేర్ మాత్రమే దక్కింది. ఇదే ఈ సినిమా ఫుల్ రన్‌లో తక్కువ మొత్తం కావడం గమనార్హం.

    గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

    KGF Chapter 2 Movie 29 Days Worldwide Box Office Collections

    ఆరంభం నుంచే సత్తా చాటిన 'కేజీఎఫ్ 2'కు 29 రోజుల్లో నైజాంలో రూ. 42.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.63 కోట్లు, గుంటూరులో రూ. 4.85 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.40 కోట్లు షేర్, రూ. 135.28 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 102.20 కోట్లు, తమిళనాడులో రూ. 52.60 కోట్లు, కేరళలో రూ. 30.46 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 214.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.32 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 29 రోజుల్లోనే రూ. 578.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 1180.03 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 4 వారాల్లోనే ఓవరాల్‌గా రూ. 576.68 కోట్లతో.. రూ. 231.68 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.40 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

    English summary
    Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Collects Rs 578.68 Cr in 29 Days in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X