KGF 3 Days Collections: శనివారం రాఖీ భాయ్ హవా.. పవన్ రికార్డు సేఫ్‌గానే.. టోటల్ కలెక్షన్లు చూస్తే!

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇటీవలే 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీన్ని విడుదల చేశారు. ఈ మూవీకి కూడా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లను పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్ ఎంట్రీ

కేజీఎఫ్ కోసం రాఖీ భాయ్ ఎంట్రీ

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన చిత్రమే'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

ముందు నుంచే 'KGF Chapter 2' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా దీనికి రూ. 345 కోట్ల వ్యాపారం జరిగింది.

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

3వ రోజూ 'కేజీఎఫ్ 2' మూవీ ఏపీ, తెలంగాణలో బాగా రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 5.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 95 లక్షలు, ఈస్ట్‌లో రూ. 58 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 10.29 కోట్లు షేర్, రూ. 16 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది

'కేజీఎఫ్ 2'కు 3 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 22.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.86 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.54 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.68 కోట్లు, గుంటూరులో రూ. 2.35 కోట్లు, కృష్ణాలో రూ. 2.08 కోట్లు, నెల్లూరులో రూ. 1.43 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 42.75 కోట్లు షేర్, రూ. 68 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

రెండు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 42.75 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 42.90 కోట్లు, తమిళనాడులో రూ. 11.42 కోట్లు, కేరళలో రూ. 8.60 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 74.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 27.10 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 206.92 కోట్లు షేర్‌తో పాటు రూ. 410.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. ఎంత రావాలి?

టార్గెట్ ఎంత.. ఎంత రావాలి?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 79 కోట్లుగా నమోదైంది. ఇక, ఇది 3 రోజుల్లోనే రూ. 42.75 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 36.25 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

పవన్ కల్యాణ్ రికార్డు పదిలం

పవన్ కల్యాణ్ రికార్డు పదిలం

'కేజీఎఫ్ 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన స్పందన దక్కుతోంది. దీంతో మూడో రోజు ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 10.29 కోట్లు రాబట్టింది. తద్వారా మూడో రోజు ఎక్కువ వసూలు చేసిన చిత్రాల జాబితాలో 9వ స్థానానికి చేరుకుంది. ఈ లిస్టులో RRR రూ. 33.53 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక, రూ. 10.43 కోట్లతో ఉన్న వకీల్ సాబ్ రికార్డు సేఫ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X