KGF 21 Days Collections: 345 కోట్ల టార్గెట్.. 3 వారాల్లోనే అన్ని కోట్లు.. RRR రికార్డు కేజీఎఫ్ గండం

రాకింగ్ స్టార్ యశ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా భారీ స్పందనను అందుకుని సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ కూడా రూపొందించారు. 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి కూడా అన్ని ఏరియాల్లో మంచి టాక్‌తో పాటు రెస్పాన్స్ కూడా దక్కింది. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది? అనేవి పరిశీలిద్దాం పదండి!

రాఖీ భాయ్ రాకతో బాక్సాఫీస్ షేక్

రాఖీ భాయ్ రాకతో బాక్సాఫీస్ షేక్

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ మూవీనే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

భారీ బడ్జెట్‌తో మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగింది.

21 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

21 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ 2' 21వ రోజు మూవీ ఏపీ, తెలంగాణలో పర్వాలేదనిపించింది. దీంతో నైజాంలో రూ. 27 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 21వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 55 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది

3 వారాలకు కలిపి ఎంతొచ్చింది

'కేజీఎఫ్ 2'కు 3 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.50 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.48 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.47 కోట్లు, గుంటూరులో రూ. 4.60 కోట్లు, కృష్ణాలో రూ. 4.08 కోట్లు, నెల్లూరులో రూ. 2.72 కోట్లతో.. కలుపుకుని రూ. 80.90 కోట్లు షేర్, రూ. 130.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

ఏపీ, తెలంగాణలో 3 వారాల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 80.90 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 97.75 కోట్లు, తమిళనాడులో రూ. 47.80 కోట్లు, కేరళలో రూ. 28.55 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 199.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 87.40 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే రూ. 541.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 1097.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 21 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 541.80 కోట్లతో.. రూ. 194.80కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 1.90 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

RRR రికార్డును కేజీఎఫ్ గండం

RRR రికార్డును కేజీఎఫ్ గండం

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 3 వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 1097.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక, RRR మూవీ 41 రోజుల్లో రూ. 605.44 కోట్లు షేర్, రూ. 1126.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఈ మొత్తాన్ని కేజీఎఫ్ అతి త్వరలోనే దాటేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X