KGF 30 Days Collections: దెబ్బ పడింది అనుకునే లోపు మళ్ళీ పెరిగిన వసూళ్లు?

పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' కన్నడ సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. హీరో యష్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా దెబ్బకు 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'ను రూపొందిస్తామని ప్రకటించి ఆ విధంగానే రూపొందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో నిర్మాత విజయ్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో అధీరాగా సంజయ్ దత్ నటించగా సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు 19 ఏళ్ళ ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ గా వ్యవహరించారు. 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'పై ఆరంభం నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రాంతాల రైట్స్ అత్యధిక మొత్తంలో అమ్ముడు పోయాయి. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ చేసుకుంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి మొదటి ఆట నుంచి అద్భుతమైన టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలోనే 30వ రోజైన శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 6 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. గురువారం నాడు 4 లక్షలు రాగా రెండు లక్షల షేర్ పెరిగింది.

KGF Chapter 2 Movie 30 Days Worldwide Box Office Collections

అలాగే, ప్రపంచవ్యాప్తంగా దీనికి రూ. 2.18 కోట్లు షేర్ మాత్రమే దక్కింది. ఇక మొదటి ఆట నుంచి సత్తా చాటిన 'కేజీఎఫ్ 2'కు 30 రోజుల్లో నైజాంలో రూ. 42.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.63 కోట్లు, గుంటూరులో రూ. 4.86 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.46 కోట్లు షేర్, రూ. 135.38 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 102.50 కోట్లు, తమిళనాడులో రూ. 52.85 కోట్లు, కేరళలో రూ. 30.55 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 215.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.80 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లోనే రూ. 580.86 కోట్లు షేర్‌తో పాటు రూ. 1184.88 కోట్లు గ్రాస్‌ రాబట్టింది. ఇక ఈ సినిమా 4 వారాల్లోనే ఓవరాల్‌గా 233.86 కోట్ల లాభాలు అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X