KGF 31 Days Collections: మళ్లీ పెరిగిన కేజీఎఫ్ వసూళ్లు.. మరో 9 కోట్లు వస్తే సంచలన రికార్డు

కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది.. దక్షిణాదిలోని భాషలో పాటు బాలీవుడ్‌లోనూ విడుదలైన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. అతేకాదు, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టి పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్‌ను అందుకుంది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్‌ దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తీసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను పోషించింది.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి వచ్చిన అప్‌డేట్లు అన్నీ మరింత హైప్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ఏరియాల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రాంతాల రైట్స్ అత్యధిక మొత్తాలకు అమ్ముడు పోయాయి. మొత్తంగా ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

KGF Chapter 2 Movie 31 Days Worldwide Box Office Collections

విడుదలకు ముందే హైప్ క్రియేట్ చేసుకుని వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్లు పొటెత్తాయి. ఇలా చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 31వ రోజైన శనివారం దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి స్పందన ఎక్కువైంది. దీంతో రూ. 10 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 2.65 కోట్లు షేర్ దక్కింది.

రిలీజ్ నాటి నుంచే సత్తా చాటుతోన్న 'కేజీఎఫ్ 2'కు 31 రోజుల్లో నైజాంలో రూ. 42.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.87 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.63 కోట్లు, గుంటూరులో రూ. 4.87 కోట్లు, కృష్ణాలో రూ. 4.24 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.56 కోట్లు షేర్, రూ. 135.56 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 102.90 కోట్లు, తమిళనాడులో రూ. 53.15 కోట్లు, కేరళలో రూ. 30.65 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 216.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 96.45 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 31 రోజుల్లోనే రూ. 583.51 కోట్లు షేర్‌తో పాటు రూ. 1191.11 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 31 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 583.51 కోట్లతో.. రూ. 236.51 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.56 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X