KGF 32 Days Collections: కేజీఎఫ్ మరో సంచలన రికార్డు.. RRR మూవీకి కూడా దక్కని ఘనత సొంతం
ఏమాత్రం అంచనాలు లేకుండానే ఐదు భాషల్లో విడుదలై.. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'. యశ్ - ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన ఈ సినిమా మరీ ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రియుల మనసులు దోచుకుని పాన్ ఇండియా రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు.
దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నెల రోజులు గడుస్తోన్నా వసూళ్లను చక్కగా రాబడుతూ దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 32 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

కేజీఎఫ్ చాప్టర్ 2 అంటూ వచ్చారు
కన్నడ స్టార్ యశ్ హీరోగా.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమే 'KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్
హిట్ కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

32 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్లు పొటెత్తాయి. అయితే, ఇవి క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 32వ రోజు ఇది రూ. 18 లక్షలే వసూలు చేసింది.

32 వారాలకు కలిపి ఎంతొచ్చింది
'కేజీఎఫ్ 2'కు 32 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.89 కోట్లు, కృష్ణాలో రూ. 4.26 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.74 కోట్లు షేర్, రూ. 135.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత
32 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో 'కేజీఎఫ్ 2'కు రూ. 83.74 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 103.63 కోట్లు, తమిళనాడులో రూ. 53.70 కోట్లు, కేరళలో రూ. 30.82 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 218.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 97.25 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 32 రోజుల్లోనే రూ. 587.54 కోట్లు షేర్‌తో పాటు రూ. 1200.15 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?
'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 32 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 587.54 కోట్లతో.. రూ. 240.54 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.74 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

RRR మూవీకి అందని ఘనత
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన సినిమాల్లో RRR ఒకటి. అయితే, ఈ చిత్రం రూ. 1200 కోట్ల గ్రాస్ మార్కును మాత్రం చేరుకోలేదు. అయితే, 'కేజీఎఫ్ చాప్టర్ 2' మాత్రం ఈ మైలురాయిని 32 రోజుల్లోనే చేరుకుని రికార్డు నెలకొల్పింది. దీనికంటే ముందు ఆ మార్కును 'బాహుబలి 2', 'దంగల్' చిత్రాలు చేరుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











