twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 33 Days Collections: కేజీఎఫ్‌కు తొలిసారి భారీ దెబ్బ.. విడుదలైన తర్వాత అతి తక్కువగా!

    |

    గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణాదిలో ఎన్నో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. దీనికి కారణం మన సినిమాల స్థాయి అంతకంతకూ పెరుగుతుండడమే. ఇలా కొన్నేళ్ల క్రితం విడుదలై.. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇటీవలే 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా చేశారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించిన ఈ మూవీలో సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

    హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

    సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీపై మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని నిజం చేస్తూ దీని నుంచి వచ్చిన అన్ని రకాల పాటలు, టీజర్, ట్రైలర్‌లకు రికార్డు స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో అత్యధిక డీల్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని గ్రాండ్‌గా విడుదలైంది.

    'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి స్పందన లభించింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్లు పొటెత్తాయి. ఇలా చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుంది. అయితే, క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 32వ రోజైన ఆదివారం దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దీనికి రూ. 18 లక్షలు షేర్ వచ్చింది. అయితే, 33వ రోజైన సోమవారం మాత్రం కేవలం రూ. 6 లక్షలే వచ్చాయి. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.72 కోట్లు షేర్ దక్కింది. ఇదే ఈ సినిమా రన్‌లో అత్యల్ఫ షేర్ కావడం గమనార్హం.

    హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!

    KGF Chapter 2 Movie 33 Days Worldwide Box Office Collections

    'కేజీఎఫ్ 2' 33 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. దీనికి నైజాంలో రూ. 42.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.80 కోట్లు షేర్, రూ. 136 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 103.95 కోట్లు, తమిళనాడులో రూ. 53.90 కోట్లు, కేరళలో రూ. 30.87 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 219.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 97.75 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 33 రోజుల్లోనే రూ. 589.26 కోట్లు షేర్‌తో పాటు రూ. 1204.20 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 33 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 589.26 కోట్లతో.. రూ. 242.26 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.80 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

    English summary
    Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Collects Rs 589.26 Cr in 33 Days in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X