twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 34 Days Collections: 34వ రోజు కూడా కేజీఎఫ్‌ సత్తా.. మరో 9 కోట్లు వస్తే గొప్ప రికార్డు

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కి.. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్‌తో రూపొందించాడు. టాక్ పరంగానే కాదు.. కలెక్షన్ల విషయంలోనూ ఇది రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా చేశారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించిన ఈ మూవీలో రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

    బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

    సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. వాటిని నిజం చేస్తూ దీని నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో అత్యధిక డీల్స్ జరుపుకోగలిగింది. దీంతో ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని భారీగా విడులైంది.

    KGF Chapter 2 Movie 34 Days Worldwide Box Office Collections

    'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు రెస్పాన్స్ మరింతగా వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కూడా పూర్తైంది. అయితే, క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే 33వ రోజు దీనికి కేవలం రూ. 6 లక్షలే వచ్చాయి. ఈ క్రమంలోనే 34వ రోజు మరింత తక్కువగా అంటే రూ. 3 లక్షలు మాత్రమే ఇది వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.22 కోట్లు షేర్‌ను రాబట్టింది.

    మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్మళ్లీ ఒక్కటైన షణ్ముఖ్, దీప్తి సునైనా: ఇద్దరూ ఒకే ఫొటో షేర్ చేసి మరీ రిక్వెస్ట్

    'కేజీఎఫ్ 2' 34 రోజుల కలెక్షన్లు చూస్తే.. దీనికి నైజాంలో రూ. 42.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.83 కోట్లు షేర్, రూ. 136.06 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 104.10 కోట్లు, తమిళనాడులో రూ. 54.05 కోట్లు, కేరళలో రూ. 30.90 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 219.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 34 రోజుల్లోనే రూ. 590.48 కోట్లు షేర్‌తో పాటు రూ. 1207.01 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

    'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 34 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 589.26 కోట్లతో.. రూ. 243.48 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.83 కోట్లు ప్రాఫిట్‌ను దక్కించుకుంది.

    English summary
    Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Collects Rs 590.48 Cr in 34 Days in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X