KGF 36 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. ఏకంగా అన్ని కోట్ల లాభాలు.. మరో 3 కోట్లు వస్తే!

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బడా హీరో రాకింగ్ స్టార్ యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సమయంలో కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా చేశారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించిన ఈ మూవీలో రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

మొదటి భాగం భారీ విజయం సాధించడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. వాటిని నిజం చేస్తూ దీని నుంచి వచ్చిన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

'కేజీఎఫ్ చాప్టర్ 2' చిత్రానికి మొదటి ఆటకే మంచి టాక్, రివ్యూలు వచ్చాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు రెస్పాన్స్ మరింతగా వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కూడా పూర్తైంది. అయితే, క్రమంగా ఈ సినిమా కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే 35వ రోజు దీనికి కేవలం రూ. 2 లక్షలే వచ్చాయి. ఈ క్రమంలోనే 36వ రోజు కాస్త పెరగడంతో రూ. 3 లక్షలు వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.15 కోట్లు షేర్‌ను రాబట్టింది.

KGF Chapter 2 Movie 36 Days Worldwide Box Office Collections

'కేజీఎఫ్ 2' 36 రోజుల కలెక్షన్లు చూస్తే.. దీనికి నైజాంలో రూ. 42.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.88 కోట్లు షేర్, రూ. 136.16 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 104.50 కోట్లు, తమిళనాడులో రూ. 54.45 కోట్లు, కేరళలో రూ. 32.02 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 220.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98.80 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 36 రోజుల్లోనే రూ. 594.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 1214.98 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

క్రేజీ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్లు (టార్గెట్ రూ. 367 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 36 రోజుల్లోనే ఓవరాల్‌గా రూ. 589.26 కోట్లతో.. రూ. 247.10 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.88 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X