Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
KGF Chapter 2 Day 38 Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా కేజీఎఫ్2
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 1'. 2018లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో సినిమాకు సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ మూవీలో రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు. ఈ సినిమా హక్కులకు అన్ని భాషల్లోనూ భారీ డిమాండ్ ఏర్పడింది.
దీంతో ఈ మూవీ కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు, తమిళనాడుకు రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 100 కోట్లు, ఓవర్సీస్లో రూ. 30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 365 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరుపుకుని గ్రాండ్‌గా రిలీజ్ అయింది.ఇక రిలీజైన తరువత దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి స్పందన దక్కింది. తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా బద్దలు కొట్టిన ఈ సినిమాకు క్రమ క్రమంగా కలెక్షన్లు తగ్గుతున్నాయి.
ఈ క్రమంలోనే 35వ రోజు దీనికి కేవలం రూ. 2 లక్షలే వచ్చాయి. ఈ క్రమంలోనే 36వ రోజు కాస్త పెరగడంతో రూ. 3 లక్షలు వసూలు చేసింది. అలాగే, 37వ రోజు కూడా అదే కలెక్షన్స్ సాదించిన ఈ సినిమా 38వ రోజు మాత్రం కొంత పుంజుకుని మొత్తం నాలుగు లక్షలు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.73 కోట్లు షేర్‌ను రాబట్టింది.
కేజీఎఫ్ 2' 38 రోజుల కలెక్షన్లు చూస్తే.. దీనికి నైజాంలో రూ. 42.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 42.82 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.95 కోట్లు షేర్, రూ. 136.30 కోట్లు గ్రాస్ వచ్చింది.
అలాగే, కర్నాటకలో రూ. 105 కోట్లు, తమిళనాడులో రూ. 54.85 కోట్లు, కేరళలో రూ. 32.15 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 221.55 కోట్లు, ఓవర్సీస్లో రూ. 99.60 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 38 రోజుల్లోనే రూ. 597.10 కోట్లు షేర్‌తో రాబట్టింది. క్రేజీ కాంబోలో వచ్చిన 'కేజీఎఫ్ 2' 38 రోజుల్లోనే ఓవరాల్‌గా 250.10 కోట్ల లాభాలు అందుకుంది. తెలుగులో రూ. 4.94 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.